iDreamPost
android-app
ios-app

OTTలోకి పాయల్ రాజ్ పుత్ యాక్షన్ మూవీ రక్షణ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Releases- Payal Rajput Rakshana Movie: ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ కొత్త సినిమా వచ్చేస్తోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. అసలు ఇది ఏ మూవీ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTT Releases- Payal Rajput Rakshana Movie: ఓటీటీలోకి పాయల్ రాజ్ పుత్ కొత్త సినిమా వచ్చేస్తోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. అసలు ఇది ఏ మూవీ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTTలోకి పాయల్ రాజ్ పుత్ యాక్షన్ మూవీ రక్షణ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పాయల్ రాజ్ పుత్ కు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మంగళవారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఆ తర్వాత తనదైనశైలిలో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అలాగే నెట్టింట కూడా ఈమె ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంటుంది. అయితే ఈమె నటించిన రక్షణ అనే సినిమా ఇటీవల టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. నిర్మాతలకు హీరోయిన్ కి మధ్య గొడవలు అని.. ప్రమోషన్స్ కి రావడం లేదు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. నెట్టింట కూడా వీల్లు బాహాటంగానే వాదోపవాదనలు చేసుకున్నారు. ఎట్టకేలకు జూన్ 7న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీలో మొదటిసారి పాయల్ రాజ్ పుత్ పోలీసు ఆఫీసర్ గా కనిపించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

పాయల్ రాజ్ పుత్ స్టోరీ సెలక్షన్, యాక్టింగ్ కు మంచి మార్కులు దక్కుతున్నాయి. ఒక పోలీసుగా ఛాలెంజింగ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాళ్లు రిలీజ్ విషయంలో ఎన్ని గొడవలు పడినా కూడా అవుట్ పుట్ ని చూశాక అభిమానులు ఓకే అనేశారు. అయితే ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా కాస్త ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా దక్కించుకుంది. ఈ మూవీని ఆగస్టు 1నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పాయల్ రాజ్ పుత్ ఉన్న ఒక పోస్టర్ ని విడుదల చేశారు.

ఇంక ఈ రక్షణ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది రెండు ఆత్మహత్యల మధ్య ఉండే మిస్టరీని ఛేదించే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. కిరణ్(పాయల్ రాజ్ పుత్) ఐపీఎస్ అధికారిక ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో తన స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంటుంది. అది హత్య అని కిరణ్ నమ్ముతుంది. కానీ, నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు. ఈలోగా ఏసీపీగా బాధ్యతలు తీసుకుంటుంది. అప్పుడు కిరణ్ కు కొత్త కష్టం వస్తుంది. తన ఫొటోలను ఇబ్బందికర రీతిలో మార్ఫింగ్ చేసి నెట్ లో పెడుతూ ఉంటాడు. కొన్నాళ్ల వెతుకులాట తర్వాత కిరణ్ ఆ కుర్రాడిని పట్టుకుంటుంది. అయితే అతను కొన్నాళ్లకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసు కిరణ్ మెడకు చుట్టుకుంటుంది. ఇలా రెండు హత్యల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటకు తీయడమే ఈ రక్షణ మూవీ. మరి.. రక్షణ మూవీ ఆహాలోకి వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.