Tirupathi Rao
OTT Movie Suggestions- Best Action Thriller Movie: కొన్ని సినిమాలకు ఎలా ఉన్నా కూడా హై రేటింగ్ ఉంటుంది. ఇంకొన్ని సినిమాలకు మాత్రం ఎంత బాగున్నా కూడా అండర్ రేటింగ్ తో సరిపెట్టుకుంటాయి. అందుకు చాలానే కారణాలు ఉంటాయి. అలాంటి ఒక అండర్ రేటెడ్ మూవీ మీకోసం తీసుకొచ్చాం.
OTT Movie Suggestions- Best Action Thriller Movie: కొన్ని సినిమాలకు ఎలా ఉన్నా కూడా హై రేటింగ్ ఉంటుంది. ఇంకొన్ని సినిమాలకు మాత్రం ఎంత బాగున్నా కూడా అండర్ రేటింగ్ తో సరిపెట్టుకుంటాయి. అందుకు చాలానే కారణాలు ఉంటాయి. అలాంటి ఒక అండర్ రేటెడ్ మూవీ మీకోసం తీసుకొచ్చాం.
Tirupathi Rao
ఓటీటీల్లో కొన్ని సినిమాలు మంచి థ్రిల్ కి గురి చేస్తాయి. అవి చూసిన తర్వాత అరె భలే సినిమా చూశామే అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మూవీస్ మీరు చాలా తక్కువే చూసి ఉంటారు. కానీ, కొన్ని మాత్రం ఎంతో మంచి సినిమాలు అయినా కూడా అండర్ రేటెడ్ గా ఉండిపోతాయి. దానికి కారణం ఆ మూవీ గురించి ఎక్కువ మందికి తెలియక పోవటం. రెండు ఆ చిత్రాన్ని ఎక్కువ మంది చూడకపోవడం. అలాంటి పరిస్థితులు ఎక్కువగా చిన్న చిన్న హీరోలకు వస్తూ ఉంటాయి. కానీ, కొన్నిసార్లు స్టార్ హీరోయిన్స్ కి కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఒక స్టార్ హీరోయిన్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా అండర్ రేటెడ్ గా మిగిలిపోయింది.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే దాదాపుగా అన్నీ హీరోయిన్ భుజానికి ఎత్తుకోవాలి.యాక్షన్, ఎమోషన్, కామెడీ, ట్విస్టులు అన్నీ హీరోయిన్ సెంట్రిక్ గానే ఉంటాయి. అలాంటి మూవీని పుల్ చేయాలి అంటే కచ్చితంగా దానికి తగిన సీనియారిటీ కూడా ఉండాలి. టాలెంట్ అయితే కచ్చితంగా ఉండాలి. అవన్నీ పుష్కలంగా ఉన్న స్టార్ హీరోయిన్ త్రిష నటించిందే ఈ మూవీ. నిజానికి ఇది మలయాళం సినిమా. కానీ , తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మలయాళంలో విడుదల కావడం.. ఆ తర్వాత ఓటీటీలో ఉన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలియడం కూడా కారణం కావచ్చు.
ఈ సినిమాలో త్రిష వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. మూవీ మొత్తాన్న తన భుజాలపై వేసుకుని ముందుకు నటిపిస్తుంది. ఒక డాక్టర్ గా ఉన్న మహిళ.. తన కుమార్తె కోసం ఒక రాజకీయ పార్టీతో.. ఆ పార్టీ కార్యకర్తలతో.. ఆ నాయకులు పురమాయించిన గూండాలతో పోరాడుతుంది. కేవలం ఆడదేగా అని తక్కువ అంచనా వేసే ఎంతో మందికి తన సత్తా ఏంటో చూపిస్తుంది. ఒక రాజకీయ నేత మరణం చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. అది సహజ మరణం అని చెప్పకుండా అసలు ఏం జరిగిందో వాకబు చేయడంతో త్రిషా చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అది కాస్తా తన కుమార్తె వరకు వస్తుంది. అలా మొత్తానికి తన లైఫ్, కుమార్తె లైఫ్ ప్రమాదంలో పడుతుంది.
రాజకీయ పార్టీ పురమాయించిన గూండాల నుంచి, రాజకీయ పార్టీ నుంచి ఎలా తప్పించుకుంది? తన కుమార్తెను రౌడీ మూక నుంచి కాపాడుకుందా? ఒక్కతే అధికారంలో ఉన్న పార్టీతో ఎలా తలపడింది? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగే పాయింట్స్. ఈ మూవీలో త్రిష యాక్టింగ్ మాత్రమే కాదు.. యాక్షన్ కూడా ఇరగదీస్తుంది. అలాగే త్రిష కూతురిగా చేసిన చిన్నారి కూడా తన నటనతో మెప్పిస్తుంది. మొత్తానికి ఇది చాలా అండర్ రేటెడ్ యాక్షన్ సర్వైవల్ డ్రామా అని చెప్పచ్చు. ఈ మూవీ పేరు ‘పరమపదం విలయాట్టు‘. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమిగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ మూవీ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.