OTT Suggestion - Best Motivation Thriller : OTTలో ఆలోచన మార్చే మూవీ.. లైఫ్ లో ఓసారైన తప్పక చూడాల్సిందే

OTTలో ఆలోచన మార్చే మూవీ.. లైఫ్ లో ఓసారైన తప్పక చూడాల్సిందే

OTT Best Motivation Thriller : కొన్ని సినిమాలు కనీసం జీవితంలో ఒక్కసారైనా చూడాలంటారు కొందరు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

OTT Best Motivation Thriller : కొన్ని సినిమాలు కనీసం జీవితంలో ఒక్కసారైనా చూడాలంటారు కొందరు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తే.. కొన్ని సినిమాలు మాత్రం జీవితంలో ఏం చేయాలి .. ఎలా ఉండాలి అనే ఓ క్లారిటీని ఇస్తూ ఉంటాయి. అలా ఇప్పటివరకు మంచి ఇన్ఫర్మేషన్ తో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. జీవితంలో అంతా కోల్పోయాం.. ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం అనుకునే వారికి.. ఈ సినిమా ఖచ్చితంగా ఓ హోప్ ను క్రియేట్ చేస్తుంది. కొన్ని సినిమాలు లైఫ్ లో ఓసారైనా చూడాలంటారు కొందరు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఈ స్టోరీ అంతా ఒక జైల్లో ఖైదీల మధ్యన జరుగుతుంది. ఈ మూవీ లో హీరో ఆండీ తన భార్య మీద ఉండే కోపంతో బాగా తాగేసి గన్ తీసుకుని.. తన వైఫ్ ఉండే ఇన్నిటికి వస్తాడు. అలానే పార్లల్ గా కోర్టులో జరిగే ఓ సీన్ ను కూడా చూపిస్తుంటారు. అక్కడ ఓ లాయర్ హీరో భార్యను, లవర్ ను చంపింది ఆండీ నే అని ప్రూవ్ చేస్తాడు. అసలు ఆండీ హత్య చేశాడా లేదా అనేది తెలియదు కానీ… అతనిని మాత్రం అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అక్కడ ఖైదీలకు పేరోల్ ఇచ్చే కమిటీ ముందు.. మరొక క్యారెక్టర్ రెడ్ అనే వ్యక్తి తన 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి మంచి మనిషిగా మారానని.. పెరోల్ ఇవ్వాలని.. అక్కడ కమిటీని అడుగుతాడు. కానీ ఎప్పటిలానే అది రిజెక్ట్ అవుతుంది. ఇక ఆండీ కూడా ఈ జైల్లోకి వెళ్తాడు. అయితే రెడ్ ఇంకా అతని గ్యాంగ్ కొత్తగా వచ్చిన ఖైదీల మీద ఎవరు ఏడుస్తారు అని పందెం వేసుకుంటారు. రెడ్ ఏమో ఆండీ మీద పందెం వేసి ఓడిపోతాడు.

ఎందుకంటే అతనిలో ఏ చలనం ఉండదు. అయితే జైల్లో ఉండే వాళ్లకు హోమో సెక్సువల్స్ నుంచి ఓ త్రెటా ఉంటుంది. దీనితో అక్కడ ఆండీని బాక్స్ అనే వ్యక్తి టార్చర్ చేస్తాడు. దీనితో ఆండీ కు ఈ గ్యాంగ్ తో.. రెడ్ గ్యాంగ్ తో డీల్ చేయాల్సి వస్తుంది. ప్రతి రోజు అతనికి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అలా జైల్లో రెండు సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే ఆండీ అక్కడ జైలు వార్డెన్ కు హెల్ప్ చేసి.. తనకు కావాల్సిన అవసరాలు సమకూర్చుకుంటారు. ఇలా చేస్తూనే ఆండీ టైమ్ పాస్ కు కొన్ని బొమ్మలు చెక్కుతూ ఉంటాడు. అయితే ఆ జైలు ఓనర్ కు కూడా ఆండీతో పని పడుతుంది. తన బ్యాంకింగ్ నాలెడ్జ్ తో ఆండీ అందరి నుంచి రెస్పెక్ట్ సంపాదిస్తాడు. దీనితో కొద్దీ రోజులకే ఆండీ అక్కడ ఫేమస్ అయిపోతాడు. రెడ్ తో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉంటాడు. అలా జైల్లో ఉన్న ఖైదీలకు కూడా హెల్ప్ చేస్తూ.. అందరిని మంచిగా మారుస్తాడు. అలా 20 సంవత్సరాలు గడిచిపోతాయి.

అప్పుడే జైల్లో మరొక వ్యక్తి వస్తాడు. ఇక్కడి నుంచి కథంతా మారిపోతుంది. అతని వలన ఆండీకి కొత్త సమస్యలు ఎదురౌతాయి. అసలు జైలు నుంచి ఆండీ తప్పించుకోగలుగుతాడా ! ఆండీనే ఆ హత్యలు చేశాడా ! ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు ఆండీ జైల్లో ఉన్న అందరికి హెల్ప్ చేస్తాడు ? ఆ తర్వాత ఏం జరిగింది ? రెడ్ ఆ జైలు నుంచి బయటకు వస్తాడా ? ఇవన్నీ తెలియాలంటే.. “ది షాషాంక్ రిడంప్షన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి .. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని కష్టాలా? OTTలో బెస్ట్ ఇన్ స్పిరేషనల్ మూవీ!

Show comments