iDreamPost
android-app
ios-app

ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని కష్టాలా? OTTలో బెస్ట్ ఇన్ స్పిరేషనల్ మూవీ!

  • Published Jul 02, 2024 | 10:41 PM Updated Updated Jul 02, 2024 | 10:41 PM

OTT Suggestions- Best Drama Star Movie: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తుంటే ఇది కదా సినిమా అనే భావన కలుగుతుంది. ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందుతుంది. మరి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTT Suggestions- Best Drama Star Movie: ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తుంటే ఇది కదా సినిమా అనే భావన కలుగుతుంది. ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందుతుంది. మరి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

  • Published Jul 02, 2024 | 10:41 PMUpdated Jul 02, 2024 | 10:41 PM
ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని కష్టాలా? OTTలో బెస్ట్ ఇన్ స్పిరేషనల్ మూవీ!

జీవితంలో ఏదో సాధించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఒక పెద్ద స్టార్ అవ్వాలి అని ఎంతోమంది కోరుకుంటారు. కానీ, అది అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం అవుతుంది అనుకున్న ఇంట్లో వాళ్లు అస్సలు అంగీకరించరు. సినిమాలు ఎందుకు దండగ అని డిస్కరైజ్ చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం అలా కాదు. ఈ తండ్రి మాత్రం కొడుకుని ఒక మంచి స్టార్ గా చూడాలి అనుకుంటాడు. అందుకు తాను చేయగలిగినంత సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ, విధి మాత్రం వేరేలా ఆలోచిస్తుంది. అతని జీవితాన్ని కొత్త మలుపులు తిప్పుతుంది. మరి.. ఆ మూవీ ఏది? ఆ కథ ఏంటో చూద్దాం.

సాధారణంగా ఏ పిల్లాడు సినిమాల్లోకి వెళ్తాను అన్నా తల్లిదండ్రులు అంగీకరించరు. ఒకవేళ ఆ కుటుంబం సినిమాల్లో ఉంటే తప్ప. కానీ, ఇక్కడ మాత్రం లెక్క వేరుగా ఉంటుంది. తన కొడుకు ఏరోజు అయినా ఒక గొప్ప స్టార్ అవ్వాలి అని ఆ తండ్రి కలలు కంటూ ఉంటాడు. అందుకు తగిన విధంగా తన కొడుకుని రెడీ కూడా చేస్తూ ఉంటాడు. అతను ఎంతో స్మార్ట్ గా చూడటానికి హీరోలాగే ఉంటాడు. ఏ వేషం వేసినా దానిని ఇట్టే సెట్ అయిపోతాడు. ఇంకేముంది తాను త్వరోలనే హీరో అవుతాను అని బాగా నమ్ముతాడు. కానీ, అతనికి జీవితంలో హీరో అవ్వడం అంటే ఎంత కష్టమో అర్థమయ్యే సమయం వస్తుంది. అంటే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అంటారు కదా అలాగే.

హీరో అయ్యేందుకు ఫిల్మ్ స్కూల్ లో కూడా చేరతాడు. అప్పటి వరకు తన కాలేజ్ తానే హీరో అనుకున్నాడు. కానీ, బయటకు వచ్చిన తర్వాత తనకు రియాలిటీ అర్థమవుతుంది. అసలు హీరో కాదు.. కదా క్యారెక్టర్ ఆర్టిస్టు అవ్వాలి అన్నా ఎంత కష్టపడాలి అని. ఆ తర్వాత అతని జీవితంలో అన్నీ చేదు ఘటనలే జరుగుతూ ఉంటాయి. కుటుంబానికి హీరోపై నమ్మకం పోతుంది. అలాగే ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్లిపోతుంది. ఇతనికి జరిగిన ఒక ప్రమాదం వల్ల ముఖం, అవతారం అంతా గుర్తు పట్టలేని విధంగా మారిపోతుంది.

ఆఖరికి తండ్రి కూడా తన కొడుకు లైఫ్ లో సక్సెస్ కాలేడు అని ఆశలు వదిలేసుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? నిజంగానే అతను లైఫ్ లో లూజర్ గా మిగిలిపోయాడా? అనుకున్నది సాధించి.. స్టార్ అయ్యాడా? ఆ తండ్రి కోరిక ఆఖరికి అయినా తీరిందా? అతని ప్రేమకథ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలు మీ మదిలో రేగితే.. వాటికి సమాధానాల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ స్టార్ అనే సినిమా చూసేయండి. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి. ఇప్పటికే ఈ స్టార్ మూవీ చూసుంటే మాత్రం.. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom