Ahaలో ఈ థ్రిల్లర్స్ వేరే లెవల్ అంతే.. వీటిని మిస్ చేశారా?

Best Telugu Thriller Movies In Aha: ఓటీటీ లో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక వీటిలో ఇప్పుడు ప్రేక్షకులు తెలుగు సినిమాలపై ఫోకస్ ఎక్కువ పెట్టడంతో.. మేకర్స్ కూడా తెలుగు కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆహ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ తెలుగు సినిమాలను చూశారో లేదో చెక్ చేసేయండి.

Best Telugu Thriller Movies In Aha: ఓటీటీ లో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక వీటిలో ఇప్పుడు ప్రేక్షకులు తెలుగు సినిమాలపై ఫోకస్ ఎక్కువ పెట్టడంతో.. మేకర్స్ కూడా తెలుగు కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆహ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ తెలుగు సినిమాలను చూశారో లేదో చెక్ చేసేయండి.

ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు వచ్చే ఇంట్రెస్టింగ్ సినిమాలను అసలు మిస్ కాకుండా చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అందులోను ఈ మధ్య తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. దీనితో తెలుగు కంటెంట్ కు లభించే ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ కూడా ఆల్రెడీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా సినిమాలను తెలుగులోకి స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. ఇక తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యే ప్లాట్ ఫార్మ్ ఆహ. మరి ఆహా లో ఉన్న బెస్ట్ థ్రిలర్ మూవీస్ ను మీరు కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

శాఖాహారి:

మే24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘శాఖాహారి’. చిన్న సినిమాగా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది ఈ సినిమా. ముందుగా ఒరిజినల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసిన సినిమాను.. ఇప్పుడు ఆగష్టు 24 నుంచి తెలుగులోకి కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఓ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం.. ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి.

కాళరాత్రి:

నల్ల నిళవుల రాత్రి అనే మలయాళ చిత్రం ఆగస్టు 17 నుంచి తెలుగులో కాళరాత్రి అనే పేరుతో.. స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కొందరు స్నేహితులు కలసి తక్కువ ధరకే 266 ఎకరాల తోటను కొనేందుకు వెళ్తారు. ఆ తోట మధ్యలో గెస్ట్ హౌస్ ఉండటంతో అక్కడ అందరూ పార్టీ చేసుకుంటారు. అయితే అనూహ్య ఘటనలతో వాళ్లలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. వారంతా ఎందుకు చనిపోతూ ఉంటారు అనే సస్పెన్స్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఈ మూవీ.

కాజల్ కార్తీక:

లేడీ ఓరియెంటెడ్ యాంగిల్ లో కాజల్ అగర్వాల్, రెజీనా హీరోయిన్లుగా నటించిన “కాజల్ కార్తీక”. ఈ సినిమా మొదట కరుంగాపియ‌మ్ పేరుతో త‌మిళంలో రూపొందించబడింది. ఆ తర్వాత కాజల్ కార్తీక పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఈ సినిమా మొత్తం కూడా మూడు స్టోరీలు ఉంటాయి. హర్రర్ కామెడీ టచ్ తో ఉండే ఈ మూవీ.. థియేటర్ లో సక్సెస్ కాలేకపోయినా.. ఓటీటీ లో మాత్రం బెస్ట్ అనిపించుకుంది. ఇంకా ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి.

నేనే నా:

మిస్టరీ కథాంశంతో రూపొందిన ‘నేనే నా’ సినిమాలో రెజీనా ఆర్కియాలజిస్ట్​గా నటించింది. ఒక అడవిలో అనుమానాస్పదంగా చనిపోయిన ఒక విదేశీయుడి హత్య కేసులో ఆర్కియాలజిస్ట్ రెజీనా సాయం తీసుకుంటారు. అయితే ఆ మర్డర్ చేసింది రెజీనా రూపంలో ఉండే మరొక అమ్మాయి. దీనితో అక్కడనుంచి అసలు హంతకరాలు ఎవరు ఎందుకు చేశారు. అనే ప్లాట్ లో ఈ మూవీ కొనసాగుతుంది. ఈ సినిమా కూడా థియేటర్ లో మెప్పించలేకపోయిన.. ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమాలే కాకుండా ఆహా లో మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments