OTT లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ముర్షిద్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

OTT Crime Thriller Murshid Web Series: ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వస్తుంది. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు కొన్నైతే.. డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు మరికొన్ని. కానీ ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది.

OTT Crime Thriller Murshid Web Series: ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వస్తుంది. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు కొన్నైతే.. డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు మరికొన్ని. కానీ ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇప్పటికే ఓటీటీ లో ఈ ప్లాట్ లో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా కూడా అదే రేంజ్ లో మంచి వ్యూస్ ను దక్కించుకుంది. ఈ ప్లాట్ లో వచ్చే సినిమాలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నా కూడా.. ఒక్కో సినిమాలో పోలీసులు ఆ కేసులను ఇన్వెస్టిగేషన్ చేసే తీరు ప్రేక్షకులను .. చివరి వరకు సినిమా చూసేలా చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయలాను చూసేద్దాం.

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ పేరు..’ముర్షిద్’. ముంబై నగరాన్ని తమ ఆదీనంలో తెచ్చుకోవడం కోసం.. కొంతమంది గ్యాంగ్ స్టార్స్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనే గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ సిరీస్ కొనసాగనుంది. ఆల్రెడీ ఈ సిరీస్ గురించి ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగష్టు 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను రివీల్ చేసారు. ఈ ట్రైలర్ ను గమనిస్తే.. ఊహించినట్లుగానే ఇది రెండు గ్యాంగ్స్ మధ్య జరిగే కథ.. మాఫియా డాన్ ముర్షిద్ పఠాన్ గా కె కె మీనన్ నటించారు. ఈ డాన్ బాంబే సుల్తాన్ గా పేరు సంపాదించుకుంటాడు. కొన్నాళ్ల పాటు వీటి అన్నిటికి దూరంగా ఉండి.. అనుకోని పరిస్థితుల వలన మళ్ళీ గన్ పట్టుకుంటాడు.

కట్ చేస్తే ఇక్కడ అసలు ట్విస్ట్ చూపిస్తారు.. అదేంటంటే ఈ గ్యాంగ్ స్టార్ కొడుకు పోలీస్. ఇక్కడ మరొక గ్యాంగ్ తో ముర్షిద్ కు వార్ నడుస్తూ ఉంటుంది. ఈ రెండు గ్యాంగ్స్ మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి ? కొడుకు పోలీస్ అయ్యి ఉండి తండ్రి గ్యాంగ్ స్టార్ గా ఎందుకు ఉన్నాడు ? ఆ తర్వాత ఏం జరిగింది? అనే ప్లాట్ లో ఈ స్టోరీ నడవనుంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి దీనిని తెలుగులోకి స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments