Swetha
Murder Mystery Series- Manvat Murders OTT Streaming Date: ఓటీటీ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చూడాలంటే .. అందరు సెర్చ్ చేసేది అయితే హర్రర్ మూవీస్ లేదా క్రైమ్ థ్రిల్లర్స్. ఇప్పుడు అలాంటి వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.
Murder Mystery Series- Manvat Murders OTT Streaming Date: ఓటీటీ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చూడాలంటే .. అందరు సెర్చ్ చేసేది అయితే హర్రర్ మూవీస్ లేదా క్రైమ్ థ్రిల్లర్స్. ఇప్పుడు అలాంటి వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.
Swetha
సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకులు చూసేది వెబ్ సిరీస్ ల కోసమే. ఇప్పటికే ఓటీటీ లో లెక్కకు మించిన వెబ్ సిరీస్ లు , సినిమాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాటిని ప్రేక్షకులు ఎలాగూ చూస్తూ ఉంటారు. అవి కాకుండా పాత వాటిని గుర్తుచేయడానికి సజెషన్స్ కూడా వచ్చేశాయి. ఇక ఉన్న వాటిలో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చూడాలంటే ఎక్కువ మంది సెర్చ్ చేసేది హర్రర్ సినిమాల కోసమే.. ఆ తర్వాత సెర్చ్ లిస్ట్ లో టాప్ ఉండేది క్రైమ్ థ్రిల్లర్స్. ఇక ఇప్పుడు అలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సేరీరిస్ రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఇప్పుడు చాలా వరకు సినిమాలను, సిరీస్ లను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇలాంటిదే. ఈ సిరీస్ పేరు మన్వత్ మర్డర్స్ . ఇదొక మరాఠి వెబ్ సిరీస్ .. 1972 లో మహారాష్ట్ర లోని మన్వత్ లో జరిగిన హత్యల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. కాగా ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా సోనీలివ్.. “ఏడు హత్యలు.. ఏడాదిన్నర పాటు ఎవరూ పరిష్కరించలేకపోయారు.. ముంబైకి చెందిన పోలీస్ అధికారి రమాకాంత్ కులకర్ణి అయినా న్యాయం చేయగలడా? మహారాష్ట్రను 1970ల్లో వణికించిన దారుణమైన క్రైమ్ ఆధారంగా తెరకెక్కిన మన్వత్ మర్డర్స్ అక్టోబర్ 4 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో అనౌన్స్ చేసింది. అంటే ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ చూడడానికి మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను గమనిస్తే.. స్టార్టింగ్ లో ఒక ఊరిలోని మర్రిచెట్టు కింద క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. అలాగే ఎవరో ఆడపిల్లలను ఎత్తుకెళ్ళి చంపేస్తూ ఉంటారు. అలా మొత్తం మీద నలుగురు ఆడపిల్లలు , ముగ్గురు మహిళలు హత్యకు గురవుతారు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో స్థానిక పోలీసులకు కూడా అర్ధం కావు. దీనితో ఈ కేసుకును సాల్వ్ చేయడానికి.. ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగుతారు . ఏడాదిన్నరగా హత్యలు జరుగుతున్నా కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, అసలు ఏమైందో తెలియకపోవడం మిస్టరీస్ గా నిలవనున్నాయి. ఇక పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేశారన్నదే ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Seven murders; Unsolved for over one & half year. Will the ace cop from Mumbai, Ramakant Kulkarni be able to bring Justice? Watch Manvat Murders, a story based on dreadful crime which shook the state of Maharashtra in 1970’s. Streaming on 4th October only on Sony LIV! pic.twitter.com/lxYkMHTnWr
— Sony LIV (@SonyLIV) September 3, 2024