Mirzapur 3 Review In Telugu: మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ!

Mirzapur Season 3 Review & Rating In Telugu: ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన మీర్జాపూర్ సీజన్ 3 ఓటీటీలోకి రానే వచ్చింది. మరి.. సీజన్ మీద నెలకొన్న భారీ అంచనాలను అందుకుందా? ఆడియన్స్ మెప్పిస్తుందా? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

Mirzapur Season 3 Review & Rating In Telugu: ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన మీర్జాపూర్ సీజన్ 3 ఓటీటీలోకి రానే వచ్చింది. మరి.. సీజన్ మీద నెలకొన్న భారీ అంచనాలను అందుకుందా? ఆడియన్స్ మెప్పిస్తుందా? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

వెబ్ సిరీస్ల మీద తెలుగు ప్రేక్షకులకు మక్కువ పెంచిన సిరీస్ ఏదైనా ఉంది అంటే అది మీర్జాపూర్ అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవల్లో కొన్ని కోట్ల మంది ఆడియన్స్ ని ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసేలా ప్రేరేపించిన సిరీస్ ఇది. 2018లో మీర్జాపూర్ అనే ఒక కొత్త గ్యాంగ్ స్టర్స్ అడ్డాని ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కేవలం కొన్ని గంటల్లోనే ఈ సిరీస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇంక తెలుగులో అయితే ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఈ సిరీస్ గురించి. ఇప్పటికే రెండ్ సీజన్స్ పూర్తి చేసుకున్న మీర్జాపూర్.. జూలై 5 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. కొత్త సీజన్ ఎలా ఉంది? అసలు కథ ఏంటి? ఎవరు ఎలా చేశారు? అన్నీ విషయాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.

మీర్జాపూర్ సీజన్ 3ని.. ఎక్కడైతే సీజన్ 2ని ముంగించారో అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. సీజన్ 1లో కాలిన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి) దగ్గర పనికి చేరిన ఇద్దరు అన్నదమ్ములు.. ఆ సీజన్ ముగిసే సమయానికి శత్రువులు అయ్యారు. తాను ప్రేమించిన యువతిని బబ్లూ పండిట్(విక్రాంత్ మాస్సే) ప్రేమించాడని కోపంతో మున్నా(దివ్యేందు).. గుడ్డు(అలీ ఫజల్) తమ్ముడినే కాకుండా.. వాళ్ల బంధువులను కూడా చంపేస్తాడు. అక్కడి నుంచే గుడ్డు త్రిపాఠి వంశంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ తర్వాత సీజన్ 2లో కాలిన్ భయ్యా కుటుంబాన్ని వేటాడటం మొదలు పెడతాడు. సీజన్ 2 ఆఖర్లో తండ్రీకొడుకులు ఇద్దరికి టార్గెట్ ఫిక్స్ చేస్తాడు. కానీ, కాలిన్ భయ్యా తప్పించుకుంటాడు. కానీ, మున్నా మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. ఆ సీజన్ ని మున్నా మరణంతో ముగించారు. ఈ సీజన్ ని మున్నా అంత్యక్రియలతో స్టార్ట్ చేశారు.

కథ:

మున్నా మరణం.. కాలిన్ భయ్యా పరారీతో బీనా ఆంటీ(రషిక దుగల్) గుడ్డుకు మద్దతు పలుకుతుంది. ఆమె సపోర్ట్ తీసుకుని మీర్జాపూర్ సింహాసనంపై గుడ్డు పండిట్ కూర్చుంటాడు. సింహాసనం అయితే దక్కించుకుంటాడు కానీ, అధికార పోరు మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపు మున్నా భార్య మాధురి(ఇషా తల్వార్) ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఆమెను శరద్ శుక్లా కలిసి అధికారం కోసం సహాయం కోరతాడు. గత రెండు సీజన్స్ లో ఎంతో పవర్ ఫుల్ గా కనిపించిన కాలీన్ భయ్యా.. ఈసారి సీజన్ లో నాలుగో ఎపిసోడ్ వరకు కనిపించడు. అతడిని కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్ను ఇద్దరూ మీర్జాపూర్ సింహాసనం మీద ఫోకస్ పెడతారు.

ఇటు గుడ్డు పండిట్ తో శరద్ శుక్లా ప్రత్యక్షంగానే యుద్ధం చేస్తూ ఉంటాడు. గుడ్డు పండిట్ ని ఎన్ని విధాలుగా బలహీన పరచాలో వాళ్లు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. గుడ్డూకి వ్యతిరేకంగా చాలానే శక్తులు ఒకటవుతాయి. ముఖ్యమంత్రి మాధురీ, శరద్ శుక్లా, దద్దా త్యాగి(లిల్లిపుట్ ఫరూఖీ), దద్దా త్యాగి కుమారుడు భరత్ త్యాగి(విజయ్ వర్మ) అంతా ఒకటవుతారు. మరోవైపు గుడ్డూ పండిట్ తండ్రి రమాకాంత్ పండిట్ జీవితంలో చాలానే విలువైన పాఠాలు నేర్చుకుంటాడు. అతనికి కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అలాగే కొత్త శత్రుత్వాలు కూడా మొదలవుతాయి. చివరికి ఎవరు ఆ సింహాసనాన్ని దక్కించుకుంటారు? ఎవరు ఆ సింహాసనం మీద కూర్చుంటారు? అసలు మీర్జాపూర్ సింహాసనాన్ని గుడ్డు పండిట్ కాపాడుకోగలిగాడా? ఇలాంటి ఆసక్తికర అంశాలతో సిరీస్ సాగుతూ ఉంటుంది.

విశ్లేషణ:

మీర్జాపూర్ సిరీస్ అనగానే ఒక హై ఎక్స్ పెక్టెషన్స్ ఉంటాయి. దీనికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మొదటి సీజన్ తో పోలిస్తే.. రెండో సీజన్ కాస్త తగ్గినట్లు అందరికీ అనిపించింది. ఇప్పుడు ఆ భావన మరింత పెరుగుతుంది. ఎందుకంటే రెండో సీజన్ కంటే మూడో సీజన్ మరీ తగ్గినట్లు అనిపించింది. మీర్జాపూర్ కి అంత క్రేజ్ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వైలెన్స్.. రెండు అందులో ఉండే ఎలివేషన్స్. ఇప్పుడు ఈ సిరీస్ ఆ రెండూ మిస్ అయినట్లు కనిపిస్తున్నాయి. ఈసారి సీజన్ లో ఎక్కువగా వైలెన్స్ కాకుండా.. బ్రెయిన్ గేమ్స్, రాజకీయాలను హైలెట్ చేశారు. అంతేకాకుండా మహిళా పాత్రలకు విపరీతైన ప్రియారిటీ వచ్చేసింది. అయితే మీర్జాపూర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందరు.

మీర్జాపూర్ అంటే కచ్చితంగా వినిపించే పేర్లు మున్నా భయ్యా, కాలిన్ భయ్యా.. ఈ రెండు పేర్లు మిస్సింగ్ ఆడియన్స్ ని కాస్త నిరాశ పరుస్తాయి. మున్నా భయ్యా పాత్రే ముగిసిపోయింది. కాలిన్ భయ్యా మొదటి 3 ఎపిసోడ్స్ వరకు అసలు కనిపించడు. అలా వాళ్లిద్దరినీ ఆడియన్స్ బాగా మిస్ అవుతారు. అలాగే ఈసారి సీజన్ లో యాక్షన్ తగ్గడంతో కాస్త ల్యాగ్ ఉంది అనే భావన కలుగుతుంది. అంతేకాకుండా.. ట్విస్టులు కూడా కాస్త ఆడియన్ ఊహకు తగినట్లే ఉండటం కూడా మైనస్ అని చెప్పచ్చు. స్క్రీన్ ప్లే కూడా తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని గెస్ చేసే విధంగా ఉండటం కూడా ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు.

ఎవరెలా చేశారు?:

ఈ సిరీస్ లో కనిపించే ప్రతి యాక్టర్ వారి పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఈ సీజన్ అలీ ఫజల్(గుడ్డ భయ్యా) తన భుజానికి ఎత్తుకున్నాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గుడ్డు భయ్యా తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రతి ఎమోషన్ ని చక్కగా పలికించాడు. అలాగే శ్వేతా త్రిపాఠి(గోలు) పాత్రకు ఈ సీజన్ లో మరితం ప్రాధాన్యత పెరిగింది. దానిని ఎక్కడా తగ్గించకుండా శ్వేతా త్రిపాఠి నటించి మెప్పించింది. ఇంక మోస్ట్ అడ్మైరింగ్ క్యారెక్టర్ చేసిన రషిక దుగల్(బీనా ఆంటీ) కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంక కనిపించేది కాసేపే అయినా పంకజ్ త్రిపాఠి మరోసారి ఆడియన్స్ ని తన నటనతో మెస్మరైజ్ చేశాడు.

ఇంక టెక్నికల్ గా చూసుకుంటే ఈ సిరీస్ టేకింగ్.. మేకింగ్ లో ఎక్కడా వంక పెట్టడానికి లేదు. కానీ, నాలుగేళ్లు తర్వాత రావడం.. ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొని ఉండటం కూడా కాస్త నెగిటివ్ చేసే ప్రమాదం ఉంది. డైరెక్టర్స్ గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ వారు చెప్పాలి అనుకున్న కథను చాలా చక్కగా చెప్పారు. కానీ, ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు అంతకు మించి ఉన్నాయి. ఇంక మ్యూజిక్, బీజీఎం, కెమెరా పనితనం ఎప్పటిలాగానే వేటికవే ది బెస్ట్ గా ఉన్నాయి. మొత్తానికి ఈసారి సీజన్ 3 మాత్రం అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అయితే మీర్జాపూర్ ఫ్యాన్స్ ని మాత్రం నిరాశ పరచదు అనే చెప్పాలి. న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం కాస్త ల్యాగ్ ఫీలయ్యే ప్రమాదం ఉంది. మీర్జాపూర్ సీజన్ 3 చూసేందుకు క్లిక్ చేయండి.

బలాలు:

  • లీడ్ యాక్టర్స్ నటన
  • కథ, కథనం

బలహీనతలు:

  • వైలెన్స్ తగ్గడం
  • అక్కడక్కడ సాగదీత
  • భారీ అంచనాలు

చివరిగా: మీర్జాపూర్ సీజన్ 3.. ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది!

రేటింగ్: 2.5/5

(*గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments