iDreamPost
android-app
ios-app

వీడియో: విశ్వక్ సేన్ కు జపనీస్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్..

  • Published Aug 16, 2024 | 8:21 PM Updated Updated Aug 16, 2024 | 8:21 PM

Vishwak Sen Got A Surprise Visit From Japanese Lady Fans: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు జపనీస్ లేడీ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. విశ్వక్ ను కలవడమే కాకుండా.. హీరోకి గిఫ్టులు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Vishwak Sen Got A Surprise Visit From Japanese Lady Fans: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు జపనీస్ లేడీ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. విశ్వక్ ను కలవడమే కాకుండా.. హీరోకి గిఫ్టులు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Aug 16, 2024 | 8:21 PMUpdated Aug 16, 2024 | 8:21 PM
వీడియో: విశ్వక్ సేన్ కు జపనీస్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో ఈయనకో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా యూత్ ని ఒక ఊపు ఊపేశాడు. ఆ తర్వాత ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగానే కాకుండా.. డైరెక్టర్ గా మారిపోయి ఆ క్రేజ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లిపోయాడు. విశ్వక్ సేన్ కెరీర్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఒక ప్రయోగం అనే చెప్పాలి. స్వతహాగా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి కథను ఎంచుకోవడం.. కథతో ప్రయోగాలు చేయడం బాగా అలవాటు అయిపోయింది. తన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. అయితే విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే తాజాగా విశ్వక్ సేన్ కి జపనీస్ ఫ్యాన్స్ ఇచ్చిన సర్ ప్రైజ్ చూస్తే మాములుగా లేదు మరి.

విశ్వక్ సేన్ కు రెండు తెలుగు రాష్ట్రాల యువతలో ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. దానిని చిన్నగా మాస్ సైడుకి తీసుకెళ్తున్నాడు. అయితే విశ్వక్ సేన్ కు జపాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనే విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. విశ్వన్ కి ఇద్దరు జపనీస్ అమ్మాయిలు కలిసిన తర్వాత ఆ విషయం అందరికీ తెలిసింది. ఇద్దరు జపనీస్ లేడీ ఫ్యాన్స్ రావడమే కాకుండా.. విశ్వక్ సేన్ కోసం సర్ ప్రైజులు కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా వాళ్లు జపనీస్ భాషలో విశ్వక్ కోసం లెటర్స్ కూడా రాసుకొచ్చారు. అలాగే కరెన్సీ లాంటి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు.

ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. తన అభిమాన హీరోను కలిశాను అని ఆనందభాష్పాలు కార్చేసింది. విశ్వక్ తో కలిసి సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. అలాగే విశ్వక్ కూడా వారికి గిఫ్ట్స్ ఇచ్చాడు. వారి అభిమానానికి ఫిదా అయిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన అభిమానులను అలా కలవడమే కాకుండా.. వారితో టైమ్ స్పెండ్ చేయడం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ స్వీట్ గెస్చర్.. అలాగే జపనీస్ అమ్మాయిల అభిమానాన్ని నెటిజన్స్ పొగిడేస్తున్నారు. ఇంక విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ, లైలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల మెకానిక్ రాకీ సినీమా నుంచి ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు’ అంటూ మంగ్లీ పాడిన లిరికల్ సాంగ్ కూడా వచ్చింది. మరి.. విశ్వక్ సేన్ కి జపనీస్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş