OTT లోకి మలయాళ క్రైమ్ కామెడీ మూవీ ‘నూనక్కుజి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Upcoming Movie- Crime Comedy Thriller Nunakkuzhi :హర్రర్ సినిమాల తర్వాత అందరూ ఎక్కువగా ఇష్టపడేది క్రైమ్ సినిమాలనే. మరి అలాంటిది క్రైమ్ కథకు కామెడీ టచ్ ఇస్తే.. ఆ సినిమా చూసేందుకు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Upcoming Movie- Crime Comedy Thriller Nunakkuzhi :హర్రర్ సినిమాల తర్వాత అందరూ ఎక్కువగా ఇష్టపడేది క్రైమ్ సినిమాలనే. మరి అలాంటిది క్రైమ్ కథకు కామెడీ టచ్ ఇస్తే.. ఆ సినిమా చూసేందుకు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

మలయాళ సినిమాలకు ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ లాంగ్వేజ్ లో వచ్చే సినిమాల జోనర్ ఏదైనా కానీ అసలు మిస్ చేయకుండా చూస్తూ ఉంటారు. ఇక వీటిలో లవ్ , రొమాన్స్ జోనర్స్ చెప్పుకోదగినవి ఆ తర్వాత.. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. అయితే హర్రర్ సినిమాల తర్వాత అందరూ ఎక్కువగా ఇష్టపడేది క్రైమ్ సినిమాలనే. మరి అలాంటి క్రైమ్ కథకు కామెడీ టచ్ ఇస్తే.. అలాంటి సినిమాను చూసేందుకు మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ లోకి అలాంటి సినిమానే రాబోతుంది. మర ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు ‘నూనక్కుజి’.. ఈ సినిమాకు మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్15 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ నే సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ ప్రధాన పాత్రలలో నటించారు. థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకే ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం. మళయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారట మేకర్స్ . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇబీ జచారియా అనే అతను తన తండ్రి మరణించడంతో.. కంపెనీ భాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. అప్పటికే అతనికి కొత్తగా పెళ్లవడంతో.. మిగిలినవేమి పట్టించుకోకుండా తన భార్య చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు వారు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోను.. తన పర్సనల్ ల్యాప్ టాప్ లో ఉంచుతానని తన భార్యను ఒప్పిస్తాడు. కానీ అనుకోకుండా అతని ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతుంది . దీనితో అధికారులు అతని ల్యాప్ టాప్ ను సీజ్ చేస్తారు. దీనితో ఆ వీడియో ఉన్న ల్యాప్ టాప్ తిరిగి రాకపోతే తానూ ఆత్మహత్య చేసుకుంటానని..అతని భార్య బెదిరిస్తుంది. ఆ తర్వాత ఏమైంది ? ల్యాప్ టాప్ దక్కించుకునే క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి ? ఆ వీడియో విషయం ఏమౌతుంది ? అనేదే మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments