iDreamPost
android-app
ios-app

OTTలోకి సునీల్ బెస్ట్ యాక్టింగ్ మూవీ! ప్రాణం పెట్టి నటించాడు!

  • Published Mar 26, 2024 | 1:26 PM Updated Updated Mar 26, 2024 | 1:43 PM

స్టార్ కమెడియన్ సునీల్ పంథా మార్చాడు. ఇప్పుడు సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. విలన్, సపోర్టింగ్ రోల్స్ తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అతడు నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

స్టార్ కమెడియన్ సునీల్ పంథా మార్చాడు. ఇప్పుడు సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. విలన్, సపోర్టింగ్ రోల్స్ తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అతడు నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

  • Published Mar 26, 2024 | 1:26 PMUpdated Mar 26, 2024 | 1:43 PM
OTTలోకి సునీల్ బెస్ట్ యాక్టింగ్ మూవీ! ప్రాణం పెట్టి నటించాడు!

కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ కమెడియన్ సునీల్.. హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో రూటు మార్చాడు. విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పుడు బిజియెస్ట్ నటుడిగా మారిపోయాడు. తమిళ సినిమాల్లో కూడా మంచి రోల్స్ కొల్లగొడుతూ.. అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్లకు కాంపిటీషన్‌గా మారిపోయాడు. ఇప్పటి వరకు తన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టించిన ఈ హాస్య నటుడు.. కలర్ ఫోటో నుండి డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. పుష్పతో సునీల్ పేరు ఇండియా లెవల్లో మారు మోగింది. మావీరన్, జైలర్, మార్క్ ఆంటోనీ, జపాన్ వంటి తమిళ చిత్రాల్లోనూ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాతల్రు పోషించాడు.

ఇప్పుడు అతడు నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గత ఏడాది మేలో థియేటరల్లో రిలీజైన కథ వెనుక కథ అనే చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మరోసారి సునీల్ నట విశ్వరూపాన్ని చూడొచ్చు. ఇందులో కేరింత ఫేమ్ విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించగా.. శ్రీజిత గౌష్ హీరోయిన్. సునీల్, జయ ప్రకాష్, ధన రాజ్, శుభశ్రీ, సత్యం రాజేష్, మధునందన్, రఘబాబు కీలక పతల్రు పోషించారు. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పై అవనీంద్ర కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా మార్చి 28 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసింది ఈటీవీ విన్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Sunil movie into OTT 03

ఎప్పటికైనా డైరెక్టర్ కావాలన్నది అశ్విన్ (విశ్వంత్) కల. ఈ క్రమంలో తన మేనమామ కూతురితో ప్రేమలో పడతాడు. సినిమా తీసి హిట్ కొడితేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని మామయ్య కండిషన్ పెట్టడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసి కథను సిద్ధం చేసుకుంటాడు. డైరెక్టర్ గా అవకాశం వస్తుంది. షూటింగ్ స్టార్ అయిన కొన్నిరోజులకే తను రాసుకున్నట్లుగానే కొంత మంది అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. అలాగే హత్యలకు గురి అవుతుంటారు. ఈ కేసును సత్య (సునీల్)కు అప్పగిస్తారు అధికారులు. ఈ కేసును చేధించే క్రమంలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయన్నదీ మిగిలిన కథ. ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇందులో మరోసారి సునీల్ బెస్ట్ యాక్టింగ్ చూడొచ్చు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş