దేవిక & డానీ తెలుగు సిరీస్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

OTT లో నిత్యం రకరకాల వెబ్ సిరీస్ లు, సినిమాలు వస్తూనే ఉంటాయి. డైరెక్ట్ OTT రిలీజ్ లకు క్రేజ్ బాగా పెరిగిందని చెప్పి తీరాల్సిందే. వెండి తెర నటీ నటులు సైతం OTT ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది ఆ వివరాలేంటో చూసేద్దాం.

OTT లో నిత్యం రకరకాల వెబ్ సిరీస్ లు, సినిమాలు వస్తూనే ఉంటాయి. డైరెక్ట్ OTT రిలీజ్ లకు క్రేజ్ బాగా పెరిగిందని చెప్పి తీరాల్సిందే. వెండి తెర నటీ నటులు సైతం OTT ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది ఆ వివరాలేంటో చూసేద్దాం.

రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే కథలన్నీ కూడా సక్సెస్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు OTT లో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ పేరు దేవిక అండ్ డానీ. వెండి తెర నటి రీతూ వర్మ ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటిస్తుంది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ లో రొమాన్స్ తో పాటు..కాస్త క్రైమ్ కూడా మిస్ అయ్యి ఉంటుందట. ఇప్పటివరకు ఎన్నో రొమాంటిక్ కథలు చూసి ఉంటాము కానీ.. ఆత్మతో రొమాన్స్ మాత్రం ఎవరు చూసి ఉండరు. అలాంటి డిఫరెంట్ ప్లాట్ ను ఎక్స్పీరియెన్స్ చేయాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను గమనిస్తే మొదట్లో దేవిక పెళ్లి కుదిరిందని ఈ సమయంలో దుష్ట శక్తుల నుంచి దూరంగా ఉండడానికి ఇంట్లో ఓ యాగం ఏర్పాటు చేస్తారు. పైగా ఆమెకు సుబ్బరాజు అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అవుతుంది. అయితే అతనితో పెళ్ళికి రెడీ అయినా తర్వాత.. మూడు నెలలు మాత్రం మరో వ్యక్తితో క్లోజ్ గా ఉంటుంది. కొద్దీ రోజులకు ఆమె ఓ ఆత్మకు దగ్గరవుతుంది. ట్రైలర్ చూస్తే అసలు ఏమి అర్థంకానుట్టుగా ఉంటుంది. ఈ ట్రైలర్ ద్వారా అయితే స్టోరీని రివీల్ చేయలేదు. కానీ చూస్తుంటే మాత్రం సిరీస్ ఇంట్రెస్టింగ్ గానే ఉందని అనిపిస్తూ ఉంటుంది.

“ఒకరు ఆమె చేయి పట్టుకుంటే.. మరొకరు ఆమె మనసును దోచుకున్నారు.. దేవిక అండ్ డానీ జూన్ 6 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో జియో హాట్ స్టార్ ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూడండి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments