OTT Best Crime Investigation Thriller :OTT లో దూసుకుపోతున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'గ్యారా గ్యారా'.. ఇంకా చూడలేదా!

OTT లో దూసుకుపోతున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘గ్యారా గ్యారా’.. ఇంకా చూడలేదా!

OTT Best Crime Investigation Thriller : ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఇలా ఓటీటీ లోకి వస్తున్నాయో లేదో.. కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ తో ఓటీటీ లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Best Crime Investigation Thriller : ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఇలా ఓటీటీ లోకి వస్తున్నాయో లేదో.. కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ తో ఓటీటీ లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

కథ బావుంటే కనుక.. ఆయా సినిమాలను ప్రేక్షకులు ఇట్టే హిట్ చేసేస్తారన్న సంగతి తెలిసిందే. అది కేవలం థియేటర్ సినిమాలకు మాత్రమే కాదు.. ఇప్పుడు ఓటీటీ సినిమాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు ఎక్కువైపోతున్నాయి. అయితే అవి ఇలా ఓటీటీ లోకి రావడమే కాకుండా.. స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ తో ఓటీటీ లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన.. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ‘గ్యారా గ్యారా’ .. విడుదలైన మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రేక్షకులంతా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ కు బాగా అలవాటు పడ్డారు. అయినా సరే ఈ ప్లాట్ లో మరొక కొత్త సినిమా వస్తుందంటే.. ఆయా సినిమాలను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అలానే ఇప్పుడు గ్యారా గ్యారా సిరీస్ కు కూడా మంచి వ్యూస్ ను అందించారు. ఈ సిరీస్ ఓటీటీ లో విడుదలైన మూడు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ విషయాన్నీ స్వయంగా సిరీస్ స్ట్రీమింగ్ పార్ట్నర్ జీ5 అధికారికంగా ప్రకటించింది. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. సిరీస్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించిందో.. కాబట్టి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయితే కనుక.. వెంటనే చూసేయండి. లేదంటే డిఫరెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే.

గ్యారా గ్యారా కథ విషయానికొస్తే.. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మాత్రమే కాదు టైమ్ ట్రావెల్ కూడా.. 1990 లో ఉండే ఓ పోలీస్ ఆఫీసర్.. ప్రెసెంట్ లో ఉండే పోలీస్ ఆఫీసర్ ను వాకి టాకీ ద్వారా సంప్రదిస్తాడు. అది కూడా కేవలం 60 సెకండ్లు మాత్రమే.. సరిగ్గా అర్ధరాత్రి 11.11 సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. కానీ వీరిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉన్నారన్న సంగతి మాత్రం వీరిద్దరికి తెలియదు. మరి వీరిద్దరూ కలిసి.. ఫ్యూచర్ ను, వర్తమానాన్నని మార్చగలర? దేనికోసం వీరిద్దరి మధ్య ఆ సంభాషణ జరుగుతుంది ? వీరిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉన్న సంగతి వారికి తెలుస్తుందా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments