డైరెక్ట్ గా OTT లోకి రానున్న స్పై థ్రిల్లర్ ‘బెర్లిన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Spy Thriller Berlin Movie OTT Details: కొన్ని సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత సంవత్సరం జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ అయినా ఏ సినిమాను.. థియేటర్ లో కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Spy Thriller Berlin Movie OTT Details: కొన్ని సినిమాలు డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత సంవత్సరం జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ అయినా ఏ సినిమాను.. థియేటర్ లో కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. అదే రేంజ్ లో ఈ సినిమాలు మంచి ఓటీటీ లో మంచి వ్యూస్ ను దక్కించుకుంటాయి. ఇక అందులోను ఓటీటీలో సస్పెన్స్ , స్పై థ్రిల్లర్స్ కు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో డైరెక్ట్ గా ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. అది కూడా ఓకే స్పై , సస్పెన్స్ థ్రిల్లర్. కాబట్టి కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు ‘బెర్లిన్’.. ఇప్పటికే ఈ సినిమా చాల ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రీమియర్ అయింది. ఈ సినిమాలో అపర్‌శక్తి ఖురానా, రాహుల్ బోస్, ఇశ్వాక్ సింగ్ లాంటి నటి నటులు ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు అతుల్ సబర్వాల్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ నేరుగా ఓటీటీ లోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. “అంతర్జాతీయంగా ఎన్నో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రశంసలు అందుకున్న బెర్లిన్ మూవీ మొత్తానికి జీ5లోకి రాబోతోంది. బెర్లిన్ జీ5లో త్వరలోనే” అనే క్యాప్షన్ తో ఈ మూవీ గురించి ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

ఈ క్రమంలో బెర్లిన్ సినిమా గురించి కొంతమంది మాట్లాడుతూ… ఈ సినిమా అంతా కూడా కొత్త ప్రపంచం అని.. కళ్ళతోనే అంత చెప్పాల్సి వచ్చిందని సైన్ లాంగ్వేజ్ కు ఇది చాల ముఖ్యం అని చెప్పుకొచ్చారు. చూడబోతుంటే ఈ సినిమాలో ఎదో కొత్త ఎలిమెంట్ ఉందని అనిపిస్తుంది. మరి మూవీ స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి. ఈ మధ్య ఎలాగూ సస్పెన్స్ థ్రిల్లర్స్ కు క్రేజ్ బాగానే పెరిగింది కాబట్టి.. ఈ సినిమాను స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments