ఫిల్మ్ జర్నలిస్ట్ మర్డర్ కేసుపై OTT లోకి ‘ది మద్రాస్ మర్డర్’ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Upcoming Web Series In Telugu: వెండి తెరపై అలరించిన నటి నటులంతా .. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇలా ఎంతో మంది వెబ్ సిరీస్ లు , మూవీస్ లతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నజ్రియా కూడా యాడ్ అయింది. ఈ అమ్మడు కూడా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

OTT Upcoming Web Series In Telugu: వెండి తెరపై అలరించిన నటి నటులంతా .. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇలా ఎంతో మంది వెబ్ సిరీస్ లు , మూవీస్ లతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నజ్రియా కూడా యాడ్ అయింది. ఈ అమ్మడు కూడా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ డిమాండ్ బాగా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది థియేటర్స్ వరకు వెళ్లకుండా… సినిమాలను ఓటీటీ లో చూడడానికే ఇష్టపడుతున్నారు. దీనితో వెండి తెరపై అలరించిన నటి నటులంతా కూడా.. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఇలా వెబ్ సిరీస్ లతో , సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మలయాళ హీరోయిన్ నజ్రియా కూడా యాడ్ అయింది. ఈ అమ్మడు తెలుగు ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు చాలా వరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని.. వెబ్ సిరీస్ లను , సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆయా కథలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు కూడా. ఈ క్రమంలోనే 1940లో మద్రాస్ ప్రెసిడెన్సీలో.. ఫిల్మ్ జర్నలిస్ట్ లక్ష్మి నాథన్ మర్డర్ కేసు.. ఎలాంటి సంచలనం సృష్టించిందో.. ఇప్పటి వారికి ఎవరికీ తెలియదు. ఆ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చి… వారికి తెలియని ఎన్నో నిజాలను పరిచయం చేస్తూ.. ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఇక నజ్రియా నజీమ్ తో పాటు.. శంత‌ను భాగ్య‌రాజ్‌, న‌ట‌రాజ్ సుబ్ర‌మ‌ణియ‌మ్ లు కూడా ప్రధాన పాత్రలో అలరించనున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ది మద్రాస్ మర్డర్’. కాగా ఈ సిరీస్ ను కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా.. అతని అసిస్టెంట్ సూర్య ప్ర‌తాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ విషయానికొస్తే.. ది మద్రాస్ మర్డర్ అనే ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రస్తుతం సిరీస్ షూటింగ్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ పై… క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఒరిజినల్ గా తమిళంలో రూపొందిస్తున్న ఈ సిరీస్ ను తమిళంతో పాటు.. తెలుగు,మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. సో ఇలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా వరుస వెబ్ సిరీస్ లు , సినిమాలతో.. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి రెడీ అయిపోతున్నాయి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments