iDreamPost
android-app
ios-app

Narne Nithin: ఇక కేరాఫ్ తారక్ బావమరిది కాదు! నార్నె నితిన్.. గట్టోడే!

  • Published Aug 16, 2024 | 3:22 PM Updated Updated Aug 16, 2024 | 3:22 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్. తొలి రెండు సినిమాలతో మంచి విజయం సాధించి.. ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. కానీ.. ఇప్పుడు అతడు కేరాఫ్ తారక్ బావమరిది కాదు. తనకంటూ ప్రత్యేక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్. తొలి రెండు సినిమాలతో మంచి విజయం సాధించి.. ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. కానీ.. ఇప్పుడు అతడు కేరాఫ్ తారక్ బావమరిది కాదు. తనకంటూ ప్రత్యేక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు.

Narne Nithin: ఇక కేరాఫ్ తారక్ బావమరిది కాదు! నార్నె నితిన్.. గట్టోడే!

ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటవారసులు వస్తుంటారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా గానీ.. వారి సత్తాను వారే నిరూపించుకోవాలి ఇక్కడ. ఇక పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలనేది పెద్దల మాట. ప్రస్తుతం ఓ యంగ్ హీరో గురించి ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. అతడు మరెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్. తొలి రెండు సినిమాలతో మంచి విజయం సాధించి.. ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

నార్నె నితిన్.. ‘మ్యాడ్’ మూవీతో సూపర్ సక్సెస్ సాధించాడు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు అతడికి ఓ ట్యాగ్ ఉండేది. నార్నె నితిన్ కేరాఫ్ తారక్ బావమరిది అని. కానీ దాన్ని ఎక్కడా ఉపయోగించుకోలేదు ఈ యంగ్ హీరో. పరిశ్రమలోకి వచ్చే ముందు తారక్ బావమరిదిగా పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఎక్కడా కూడా తారక్ తో ప్రమోషన్స్ చేయించలేదు. పైగా అతడు ఎంచుకున్న స్టోరీస్ కూడా కంటెంట్ బేస్డే. మ్యాడ్ తో పాటుగా లేటెస్ట్ హిట్ ఆయ్ సినిమాలు రెండు కూడా స్టోరీ బేస్డ్ కాన్సెప్టే. ఇందులో ప్రత్యేకించి హీరో పాత్ర అంటూ ఉండదు.. కథ ముందుకు వెళ్తుంటే.. దానితోపాటే అతడి పాత్రసాగుతూ ఉంటుంది. ఇలా సెలెక్టీవ్ కథలను ఎంచుకుంటూ పరిశ్రమలో తనకంటు ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకుంటున్నాడు.

narne nithin

అదీకాక పరిశ్రమలోకి వచ్చే ముందు తారక్ బావమరిది అనే ట్యాగ్ ను హైప్ చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే? ఈ ట్యాగ్ ను హైప్ చేస్తే.. కామన్ గానే అతడి సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఆ అంచనాలను అందుకొనే క్రమంలో ఫలితాలు కాస్త అటు ఇటు కావొచ్చు. ఇది ముందే గ్రహించినట్లున్నాడు ఈ యంగ్ హీరో. అందుకే ఆ ట్యాగ్ ను లైట్ వేలో టచ్ చేస్తూ.. రెండు వరుస విజయాలతో ఇప్పుడు తనకు తానే హీరోగా ఆడియెన్స్ లో రిజిస్టర్ అయ్యాడు. నార్నె నితిన్ అంటే ప్రేక్షకులు ఇప్పుడు ఠక్కున చెప్పేస్తారు. భారీ బ్యాగ్రౌండ్ ఉంది, భారీ మాస్ అండ్ కమర్షియల్ చిత్రాలతో రావాలని ఇతడు ఆలోచించలేదు. అందరికంటే భిన్నంగా, చాలా సెలెక్టీవ్ గా కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. రెండు సినిమాలు ఇచ్చిన విజయాలతో ఇప్పుడు అతడు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోగల స్థాయికి వచ్చేశాడు. ఇక నార్నె నితిన్ అంటే కేరాఫ్ తారక్ బావమరిది కాదు.. అతడు గట్టోడే అంటూ సగటు సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ యంగ్ హీరో ఎలాంటి సినిమాలతో అలరిస్తాడో చూడాలి.