భారీగా పలికిన ‘మిస్టర్ బచ్చన్’ OTT రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mr Bachchan is OTT Rights Deal: ఇండస్ట్రీలో హిట్టు.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో ప్రేక్షకు ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి కమర్షియల్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mr Bachchan is OTT Rights Deal: ఇండస్ట్రీలో హిట్టు.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో ప్రేక్షకు ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి కమర్షియల్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ మూవీస్ తీయడంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తర్వాత ఆయన ఇమేజ్ మరింత పెరిగిపోయింది. హరీష్ శంకర్ మూవీస్ లో యాక్షన్, సెంటిమెంట్ మాత్రమే కాదు..కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది. తెరపై స్టోరీ నడిపిస్తూ..అవసరానికి తగ్గ హాస్యాన్ని జోడిస్తారు. విభిన్నమైన కథలు ఎన్నుకొని ప్రేక్షకులను అలరిస్తున్న హరీష్ శంకర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఓ వైపు పవన్ కళ్యాన్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పనులు చూస్తూనే.. మాస్ మహరాజ రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకే పలికినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మాస్ మహరాజ రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీలీజ్ కి సమయం దగ్గర పడుతున్న వేళ ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే మూవీ బిజినెస్ విషయం చర్చనీయాంశంగా మారంది. ఈ మూవీకి ఏకంగా రూ.35 నుంచి రూ.45 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. పీపుల్స్ మీడియా, రవితేజ గత మూవీ ‘ఈగల్’ సంక్రాంతి కానుకగా వచ్చి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈగల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఆగింది. ఈ మూవీ ఫ్లాప్ కావడానికి ఓటీటీ రైట్స్ డీల్ చేయడంలో పీపుల్ మీడియా ఇబ్బందులు పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే మిస్టర్ బచ్చన్ మూవీని ముందుగానే డీల్ చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘మిస్టర్ బచ్చన్’ రైట్స్ రూ.19.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.   ఇటీవల ఓటీటీ సంస్థలు ప్రతి విషయం ఆచితూచి కొనుగోలు చేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా డీల్ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం స్టార్ హీరో, స్టార్ దర్శకులు ఉంటేనే డీల్ చేయడామిని ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ భారీ ధరకు అమ్ముడు కావడం విశేషమనే చెప్పాలి. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో గతంలో మిరపకాయ్ మూవీ వచ్చింది. కానీ కమర్షియల్ గా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మరి వీరిద్దరు ‘మిస్టర్ బచ్చన్ ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.

Show comments