iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేస్తోన్న అభినవ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • Published Jan 09, 2024 | 6:02 PM Updated Updated Jan 09, 2024 | 6:02 PM

మైనే ప్యార్ కియా అనే మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి, మళ్లీ రావాతో మెప్పించాడు అభినవ్ గోమఠం. ఈ నగరానికి ఏమైంది మూవీలో కౌశిక్ పాత్రలో మెరిశాడు. అతడు అసలు పేరు మర్చిపోయేలా ఎలివేట్ అయ్యింది ఈ నేమ్. గత ఏడాది విరూపాక్ష, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో మెరిశాడు. అలాగే.. సేవ్ ది టైగర్స్ లో నవ్వులు పువ్వులు పూయించాడు.. ఇప్పుడు..

మైనే ప్యార్ కియా అనే మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి, మళ్లీ రావాతో మెప్పించాడు అభినవ్ గోమఠం. ఈ నగరానికి ఏమైంది మూవీలో కౌశిక్ పాత్రలో మెరిశాడు. అతడు అసలు పేరు మర్చిపోయేలా ఎలివేట్ అయ్యింది ఈ నేమ్. గత ఏడాది విరూపాక్ష, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో మెరిశాడు. అలాగే.. సేవ్ ది టైగర్స్ లో నవ్వులు పువ్వులు పూయించాడు.. ఇప్పుడు..

  • Published Jan 09, 2024 | 6:02 PMUpdated Jan 09, 2024 | 6:02 PM
OTTలోకి వచ్చేస్తోన్న అభినవ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇప్పుడంటే హీరోకు ఎలివేషన్ ఎక్కువ ఇచ్చి.. సైడ్ క్యారెక్టర్లను సైడ్ చేసేస్తున్నారు దర్శకులు. కానీ ఒకప్పుడు.. ఓ కమెడియన్‌ను లేదా అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నటుల్ని హీరోలకు స్నేహితుడిగా పెట్టేవారు. హీరో ఉంటే.. ఆ పక్కనే కో స్టార్ ఉండేవాళ్లు. శుభలేఖ సుధాకర్, సుధాకర్, ఆలీ, బ్రహ్మానందం కామెడీ యాక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్‌తో అలరించారు. ఇటీవల కాలంలో హీరో పక్కనే ఫ్రెండ్ క్యారెక్టర్స్ చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే ఆ లోటును పూడుస్తున్నారు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్యం రాజేష్, అభినవ్ గోమఠం లాంటి వాళ్లు. వీళ్ల కామెడీ టైమింగ్‌లతో కితకితలు పెట్టిస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్లు కూడా హీరోలుగా మారి.. తమ సత్తాను చాటుతున్నారు.

మళ్లీ రావా, ఈ నగరానికి ఏమైందీ సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన నటుడు అభినవ్ గోమఠం. ఇతడి వాయిస్, సైలెంట్ పంచెస్ సినిమాకు హైలెట్ అవుతుంటాయి. ఇటీవల సేవ్ ద టైగర్ వెబ్ సిరీస్ ద్వారా అలరించాడు. అభినవ్, రోహిణీ సీన్స్ ఈ సిరీస్ కే హైలెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మరో ఓటీటీ మూవీతో రాబోతున్నాడు. మై డియర్ దొంగ అనే సినిమా రాబోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు సర్వజ్ఞ కుమార్. శాలినీ కొండెపూడి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీకి ఆమె రైటర్ కావడం విశేషం. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆహా ఓటీటీ తాజాగా విడుదల చేసింది.

’అందులో అడవి దొంగ విన్నారు, టక్కరి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ ఈ మై డియర్ దొంగ ఎవరు‘ అంటూ ఓటీటీ సంస్థ ఆహా ఓ అప్ డేట్ ఇచ్చింది. గతంలో కూడా ఈ మూవీ అప్ డేట్‌కు సంబంధించి ఓ ఫన్నీ వీడియోను చూపించి.. అభినవ్ గోమఠం క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆహాలో త్వరలో రాబోతున్నట్లు ఎనౌన్స్ చేసింది. జనవరి చివరి వారంలో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు కామెడీ సినిమాలకు, ఓటీటీ సిరీస్, సినిమాలకు బెస్ట్ ఆప్షన్ అయ్యాడు అభినవ్. అతడి కామెడీ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet