iDreamPost
android-app
ios-app

OTT: నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు

  • Published Feb 08, 2024 | 2:45 PMUpdated Feb 08, 2024 | 2:45 PM

ఈ మధ్య కాలంలో ఓటీటీ కి పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే థియేటర్ లో విడుదల అయిన కొద్దీ రోజులకే ఓటీటీలలో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఓటీటీ కి పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే థియేటర్ లో విడుదల అయిన కొద్దీ రోజులకే ఓటీటీలలో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి.

  • Published Feb 08, 2024 | 2:45 PMUpdated Feb 08, 2024 | 2:45 PM
OTT: నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు

ఈ మధ్య వచ్చిన సినిమాల ఓటీటీ రిలీజ్ లు ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఓటీటీలో చాలా తొందరగా వస్తున్నాయి. కాబట్టి థియేట్రికల్ రిలీజ్ కు, ఓటీటీ రిలీజ్ కు మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్నాయి.ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ థియేటర్లో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో వచ్చింది. వెంకటేష్ నటించిన సైంధవ్ కూడా కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. సలార్ లాంటి భారీ సినిమా కూడా కేవలం 4 వారాల్లోనే ఓటీటీలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానున్న గుంటూరు కారం విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలన్నిటికీ 4 వారాలు లేదా అంతకంటే ముందే డిజిటల్ రిలీజ్ లు జరిగి పోయాయి. పాన్ ఇండియా లేదా భారీ బడ్జెట్ సినిమాలు కూడా 4 వారాల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ల విషయంలో మాత్రమే అందుకు మినహాయింపు ఇస్తున్నారు. ఎందుకంటే పీవీఆర్, ఐనాక్స్ , సినీపోలీస్ (PIC) వంటి నేషనల్ మల్టీప్లెక్స్ చైన్లు అంత తక్కువ సమయంలో ఓటీటీ విడుదల ఉంటే సినిమాను తమ స్క్రీన్లలో ప్రదర్శించడానికి ఒప్పుకోవు.

దీని వల్ల ప్రేక్షకులలో ఆసక్తి తగ్గిపోవడం, రిపీట్ ఆడియన్స్ పరిమితం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. థియేటర్లకి కూడా ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరం అనే చెప్పాలి. ఒక సినిమాకి మంచి టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. అదే ఒక సినిమాకు యావరేజ్ టాక్ వస్తే పాత రోజుల మాదిరి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. కేవలం బాలీవుడ్ మాత్రమే థియేట్రికల్ రిలీజ్ కి ఓటీటీ రిలీజ్ కి మధ్య 8 వారాల గ్యాప్ ను ఏమాత్రం ఇబ్బంది లేకుండా పాటిస్తోంది. కానీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలన్నీ కేవలం 4 వారాలు లేదా అంతకంటే తక్కువ గ్యాప్ ను ఫాలో అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి