iDreamPost
android-app
ios-app

ఆ OTTలోకి మంగళవారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • Published Dec 08, 2023 | 6:07 PM Updated Updated Dec 08, 2023 | 6:07 PM

పాయల్ రాజ్ పుత్, నంది శ్వేత కీలక పాత్రల్లో గత నెలలో థియేటర్లలో సందడి చేసిన మూవీ మంగళవారం. మహా సముద్రం డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.

పాయల్ రాజ్ పుత్, నంది శ్వేత కీలక పాత్రల్లో గత నెలలో థియేటర్లలో సందడి చేసిన మూవీ మంగళవారం. మహా సముద్రం డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.

  • Published Dec 08, 2023 | 6:07 PMUpdated Dec 08, 2023 | 6:07 PM
ఆ OTTలోకి మంగళవారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం మంగళవారం. గత నెలలో ఆడియెన్స్ ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని వర్గాల నుండి మంచి అప్లాజ్ వచ్చాయి. ఆర్‌ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబోలో వచ్చిన మూవీపై తొలి నుండి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు వీరిద్దరి కాంబినేషన్ అనగానే అభిమానులు ఈ మూవీపై ఆసక్తి కనబరిచారు. దీనికి తోడు కాంతార ఫేం అజనీష్ సంగీతాన్ని అందించడం ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. నవంబర్ 17వ తేదీన విడుదలైన ఈ మూవీ ట్రెమండస్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లను రాబట్టుకుంది. కథ, కథనాన్ని దర్శకుడు ఆద్యంతం ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు హిట్ అందించారు.

పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్యా పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్, శ్రవణ్ రెడ్డి తదితరులు నటించారు. ఆర్ ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్ కు సరైన హిట్ పడలేదని చెప్పొచ్చు. అలాగే దర్శకుడు అజయ్ భూపతి మహా సముద్రం అనే మూవీని తెరకెక్కించాడు. చాలా సంవత్సరాల తర్వాత సిద్దార్థ్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సమయంలో మళ్లీ వీరిద్దరి కలయికలో మూవీ అంటే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సైకలాజికల్ మిస్టర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్‪ను అందుకుంది. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్‌గా రన్ అయిన ఈ సినిమా త్వరలో డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ డిసెంబర్ మంత్ ఎండింగ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.

mangalavaram movie ott relaease

మంగళవారం మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తర్వలో ప్రసారం కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీ డిసెంబర్ 22 నుండి ఓటీటీలో సందడి చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సినిమా ప్రీమియర్ డేట్‍ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచిన మంగళవారం మూవీ.. ఓటీటీలో రికార్డులు బద్దలు కొడుతుందో.. ఏ మేరకు అలరిస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఈ మూవీని థియేటర్లలో చూడని ప్రేక్షకులు.. ఓటీటీలో వీక్షించేందుకు రెడీగా ఉండండిక. ఈ మూవీని ఎందుకు చూడాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet