iDreamPost
android-app
ios-app

Kotabommali PS: నెల తిరక్కుండానే ఓటీటీలోకి ‘కోటబొమ్మాళి పీఎస్‌’

కోట బొమ్మాళి పీఎస్‌ చాలా కాలం సస్పెన్స్‌ తర్వాత నవంబర్‌ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మూవీకి మంచి స్పందన వచ్చింది.

కోట బొమ్మాళి పీఎస్‌ చాలా కాలం సస్పెన్స్‌ తర్వాత నవంబర్‌ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మూవీకి మంచి స్పందన వచ్చింది.

Kotabommali PS: నెల తిరక్కుండానే ఓటీటీలోకి ‘కోటబొమ్మాళి పీఎస్‌’

హీరో శ్రీకాంత్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ కోట బొమ్మాళి పీఎస్‌’ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని నెలల పాటు విడుదల విషయంలో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు నవంబర్‌ 24వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ‘లింగిడి’ అనే పాటతో మూవీకి మంచి ప్రమోషన్‌ లభించింది. సినిమాపై అంచనాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు జనాలు మూవీకి క్యూ కట్టారు. ప్రేక్షకుల నుంచి కోట బొమ్మాళి పీఎస్‌కు మంచి స్పందన వచ్చింది.

రివ్యూవర్లు కూడా మూవీకి మంచి రివ్యూలు ఇచ్చారు. చాలా కాలం తర్వాత హీరో శ్రీకాంత్‌ ఖాతాలో ‘ కోట బొమ్మాళి పీఎస్‌’ కారణంగా ఓ హిట్‌ వచ్చి చేరింది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక, ఈ చిత్ర ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోట బొమ్మాళి పీఎస్‌ థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోందట. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవ్వనుందట.

kota bommali movie in ott

డిసెంబర్‌ 26వ తేదీనుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ అవ్వనున్నట్లు సమాచారం. కాగా, కోట బొమ్మాళి పీఎస్‌ మలయాళ సినిమా ‘నాయట్టు’కు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో ఈ చిత్రానికి మార్టిన్‌ పక్కట్‌ దర్శకత్వం వహించారు. మూవీ మలయాళంలో సూపర్‌ హిట్‌ కావటంతో దర్శకుడు తేజమణి తెలుగులోకి రీమేక్‌ చేశారు. బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్‌లు సంగీతం అందించారు. అయితే, దర్శకుడు తేజమణి తెలుగులో కొన్ని మార్పులు చేశాడు.

సోల్‌ మాత్రమే ఉంచి.. సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాడు. ట్విస్టులు అలానే ఉంచాడు. ప్రధాన పాత్రలు చేసిన శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, మురళీ శర్మలు పోటాపోటీగా నటించారు. శ్రీకాంత్‌ నటన సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది.

సినిమా కథ ఏంటంటే.. 

రామకృష్ణ( శ్రీకాంత్‌), కుమారి( శివానీ రాజశేఖర్‌), రవి ( రాహుల్‌ విజయ్‌) కోట బొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పని చేస్తూ ఉంటారు. కుమారి కారణంగా  రామకృష్ణ, రవిలు ఓ వివాదంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ముగ్గురూ ఓ మర్డర్‌ కేసులో చిక్కుకుంటారు. తోటి పోలీసులకు చిక్కుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరకు ఈ ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారా? లేదా? అన్నదే మిగిలిన కథ. మరి, కోట బొమ్మాళి పీఎస్‌ ఓటీటీ విడుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.