iDreamPost
android-app
ios-app

Devara మూవీ డే 1 కలెక్షన్ ఎంత రావచ్చంటే?

  • Published Sep 27, 2024 | 7:36 PM Updated Updated Sep 27, 2024 | 7:36 PM

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ నేడు 'దేవర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ నేడు 'దేవర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Devara మూవీ డే 1 కలెక్షన్ ఎంత రావచ్చంటే?

టాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా తమ సినిమాలతో భారీ వసూళ్లు రాబట్టే హీరోలు ఉన్నారు. అందులోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టే హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. అలాంటి హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన నేడు ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో సంచలన రికార్డులు నమోదు చేసింది. నేడు భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తమ అభిమాన హీరోని చాలా కాలం తరువాత థియేటర్లో చూసుకున్న అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దేవర కోసం థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. సినిమా చూసిన అభిమానులు ఇది పక్కా మాస్ బొమ్మ అని కామెంట్స్ చేస్తునారు.

థియేటర్ల వద్ద దేవర వాతావరణం చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల జాతర సృష్టించేలా తెలుస్తుంది. దీంతో దేవర డే వన్ ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈ మూవీకి మ్యాట్నీ షో నుంచి బుకింగ్స్ ఇంకా ఎక్కువ పెరిగాయని తెలిసింది. దీంతో మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 40 కోట్ల రేంజిలో షేర్ అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో కూడా ఈ సినిమాకి అదిరిపోయే వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే నార్త్ ఇండియా, తమిళనాడు, కేరళలో యావరేజ్ ఓపెనింగ్స్ రాబడుతుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ ఏరియాలన్నీ కలిపి 60 కోట్ల రేంజిలో షేర్ వసూళ్లు రావొచ్చని అంచనా.

ఇక దేవర ఓవర్సీస్ లో విడుదలకు ముందు ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందువల్ల అక్కడ ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది. ఇక ఓవరాల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 120 కోట్ల రేంజిలో గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ మారే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజికల్ వసూళ్లని రాబట్టవచ్చు. మరి చూడాలి ఈ సినిమా డే 1 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో. ఇక దేవర మొదటి రోజు వసూళ్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet