Swetha
ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉంటాయి. కానీ, ఒకప్పటి చరిత్రను, ఇప్పటి వారికి కూడా తెలియజెప్పే సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. ఒకవేళ ఈ సినిమాను కనుక మీరు మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి.
ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉంటాయి. కానీ, ఒకప్పటి చరిత్రను, ఇప్పటి వారికి కూడా తెలియజెప్పే సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. ఒకవేళ ఈ సినిమాను కనుక మీరు మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి.
Swetha
ఇప్పటివరకు థియేటర్స్ లో, ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చి ఉన్నాయి. కానీ, వాటిలో నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని వచ్చే సినిమాలు, సిరీస్ లు మాత్రం చాలా తక్కువ. అయితే వాటికి లభించే ఆదరణ మాత్రం అంతా ఇంతా కాదు. అందులోను చరిత్రను తెలియజెప్పే కథలు ఇంకా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఆయా సినిమాలను చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడో జరిగిన సంఘటనలను, కనుమరుగైపోయింది వీరుల పోరాటాలను .. ఇప్పటి వారికి కళ్ళకు కట్టినట్లు చూపించేది కేవలం సినిమా మాత్రమే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ చూడాలి అనే విషయాలను చూసేద్దాం.
ఒకప్పుడు స్త్రీల రొమ్ములపైన పన్నులు వసూళ్లు చేసే వారని ఎంత మందికి తెలుసు ! అలాంటి రోజులలో ఆ దారుణాలపై పోరాడిన కొంతమంది వీరుల చరిత్ర ఈ సినిమా. ఈ సినిమా పేరు.. పథానపథం నూత్తాండు. మలయాళంలో వచ్చిన ఓ పీరియాడిక్ హిస్టారికల్ సినిమా ఇది. పథానపథం నూత్తాండు అంటే తెలుగులో అర్ధం 19 వ శతాబ్దం అని. తెలుగులో ఈ చిత్రాన్ని “పులి: the 19th century” అనే టైటిల్ తో విడుదల చేశారు. ఆంగ్లేయుల పాలనలో బానిసలుగా ఉన్న ప్రజలను.. కొంత మంది వీరులు వారిపై ఎలా పోరాటం చేశారు అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నాన్ని చేశారు మేకర్స్. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఓ వర్త్ వాచింగ్ రియల్ స్టోరీని మిస్ అయినట్లే. ఈ సినిమా ఆహ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. అసలు ఈ సినిమా ఎందుకు వర్త్ వాచింగ్, ఎందుకు ఈ సినిమాను చూడాలి అనే విషయానికొస్తే..
తక్కువ జాతి స్త్రీలు పై వస్త్రాలు ధరించకూడదు, మోకాలి కింద వరకు బట్టలు వేసుకోకూడదు, ఇంకా ఆడవారి రొమ్ములకు, మగవారి మీసాలకు కూడా పన్నులు కట్టాలి.. ఇలాంటి ఎన్నో నీచమైన నిబంధనలు ఒకప్పుడు కేరళ ప్రాంతాలలో ఉండేవి. అవి కనుక పాటించకపోతే వారికి మరణం దండన వేసేవారు. ఈ క్రమంలోనే అరాట్టుపుళ వేలాయుధ పానిక్కర్ అనే ఓ వీరుడు వారికి విరుద్ధంగా పోరాడి తన ప్రాణాలను సైతం అర్పించాడు. ఆ వీరుడిని ఆధారంగా తీసుకుని రూపొందించిన కథే ఇది.
ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో ఓ సభను ఏర్పాటు చేసినపుడు.. పేద మహిళలకు లీడర్ గా వ్యవహరించే నన్నేలి అనే మహిళపై వస్త్రాలతో తన రొమ్ములు దాచుకుంది. దీనితో బ్రిటిష్ సైన్యం ఆమెపై దాడికి పాల్పడతారు. ఈ క్రమంలో ఆమె తన రొమ్ములు కోసిచ్చి.. ‘‘ఇది తీసుకెళ్లి మీ మహారాజుకు ఇవ్వండి. మానమర్యాదలు లేని ఈ రాజ్యంలో నేను బతకను’’ అంటుంది. ఇక అప్పటినుంచి పానిక్కర్ తన బ్రిటిష్ వారికి విరుద్ధంగా తన పోరాటాన్ని మొదలు పెడతాడు. అతడు ఎలా పోరాడాడు, ఇంకా ఎలాంటి సమస్యలను ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్నారు అనేది చూడాలంటే.. ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.