iDreamPost
android-app
ios-app

OTTలోకి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్.. లవ్ సెక్స్ డెత్! ఈరోజు నుండే!

ఇప్పుడు ఓటీటీలదే హవా. థియేటర్లలో సినిమాలు చూసే వారి కన్నా.. ఓటీటీలో మూవీస్ వాచ్ చేస్తున్న వారి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగింది. దీంతో ఓటీటీల కోసమే సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇప్పుడు ఓటీటీలదే హవా. థియేటర్లలో సినిమాలు చూసే వారి కన్నా.. ఓటీటీలో మూవీస్ వాచ్ చేస్తున్న వారి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగింది. దీంతో ఓటీటీల కోసమే సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు.

OTTలోకి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్.. లవ్ సెక్స్ డెత్! ఈరోజు నుండే!

వీకెండ్‌లో థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ కన్నా.. ఓటీటీలో వచ్చే చిత్రాల కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. మూవీకి మంచి టాక్ నడుస్తుందా.. వెంటనే ఓటీటీలో చూసేయాల్సిందే. అలాగే థియేటర్లలో మిస్ అయ్యామనుకున్న సినిమాలు ఓటీటీలోకి రాగానే చూసేస్తున్నారు. ఏ జోనర్ అయినా వదిలిపెట్టడం లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు.. వెబ్ సిరీస్, సినిమాలను చూస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే దర్శక నిర్మాతలు.. కొత్త కొత్త కథలతో.. ఓటీటీల కోసమే సినిమాలు, సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు.

అలాంటి ఓ వెబ్ సిరీస్సే లవ్ సెక్స్ డెత్. ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరిస్తుండగా.. తాజాగా వాటి జాబితాలోకి చేరింది ఈ సిరీస్. సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన లవ్ సెక్స్ డెత్(LSD).. ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ నిండా సెక్స్ ,లవ్, మదర్ సెంటిమెంట్‌ను నింపేశారు. మూడు జంటల మధ్య జరిగే ఉత్కంఠమైన సన్నివేశాలు, మర్డర్స్, వాటిని ఎవరు చేశారన్న సస్పెన్స్ మెయిన్‌టెన్ చేస్తూ ట్రైలర్ కట్ చేశారు. అలాగే దిల్ రాజు ఓ తమిళ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు వేనుమా-ఇరుక్కు.. పదాన్ని ఇందులో కూడా వినియోగించారు. అయితే కాస్త డిఫరెంట్‌గా పాట రూపంలో ప్రజెంట్ చేశారు. ఇది మొత్తానికి ఒక డార్క్ కామెడీ థ్రిల్ వెబ్ సిరీస్‌లా కనిపిస్తోంది.

The newest psychological thriller into OTT

ట్రైలర్ చివరిలో తెలుగు, హిందీ భాషల్లో లవ్ సెక్స్ డెత్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. ప్రాచీ టకర్, నేహా దేశ్ పాండే, ప్రభాకర్, కునాల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్ తల్లిగా ఐ డ్రీమ్ యాంకర్ అంజలి యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరైన శివ కథను అందించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 2 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకు ఈ వెబ్ సిరీస్ ఏ ఫ్లాట్ ఫాంలో ప్రసారం కానుందంటే.. ఎంఎక్స్ ప్లేయర్. ఈ మూవీకి ప్రవీణ్ మణి, శశాంక్ తిరుపతి సంగీతం అందించారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ను వీక్షించవచ్చు.