Venkateswarlu
ప్రపంచ ప్రఖ్యాత బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా 800 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
ప్రపంచ ప్రఖ్యాత బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా 800 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
Venkateswarlu
మామూలు సినిమాలతో పోల్చుకుంటే బయోపిక్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుంది. వాటిలోకూడా స్పోర్ట్స్ తారల బయోపిక్‌లకు మార్కెట్ పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అందుకే దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పోర్ట్స్ తారల బయోపిక్‌లు తరచుగా సినిమాలుగా తెరకెక్కుతూ ఉంటాయి. అలా క్రికేట్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర కూడా బయోపిక్‌గా తెరకెక్కింది. 800 పేరిట తెరకెక్కిన ఆ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుర్ మిత్తల్, మహిమా నంబియార్, నరేర్‌లు కీలక పాత్రలు చేశారు. ఇక, ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులనే కాక, విమర్శకులను కూడా మెప్పించింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్‌డేట్ వచ్చింది. 800 సినిమా అతి త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 2వ తేదీనుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు సింహళ భాషలోనూ స్ట్రీమ్ అవ్వనుంది.
కొంతమంది తమిళులు శ్రీలంక తేయాకు తోటల్లో పని చేయడానికి ఇండియానుంచి శ్రీలంకకు వెళతారు. అలా వెళ్లిన వారిలో ముత్తయ్య తాత, నాన్నమ్మలు కూడా ఉంటారు. ముత్తయ్య అక్కడే శ్రీలంకలో జన్మిస్తాడు. అయితే, శ్రీలంక స్థానికులకు, తమిళులకు మధ్య జరిగిన గొడవల్లో ముత్తయ్య కుటుంబం ఆస్తులు కోల్పోతుంది. దీంతో ఆయన ఓ చర్చ్ ఫాదర్ నడిపే స్కూల్లో చేరతాడు. అక్కడ క్రికేట్ నేర్చుకుంటాడు. ఈ నేర్చుకునే క్రమంలో తమిళ వ్యక్తి అన్న కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. అయినా వెనక్కు తగ్గకుండా పట్టుదలతో.. క్రికేట్ మీద ఇష్టంతో ముందుకు సాగుతాడు. శ్రీలంక క్రికేట్ టీంకు సెలెక్ట్ అవుతాడు. ప్రపంచ మొత్తం తనవైపు తిరిగి చూసుకునేలా 800 వికేట్లు తీసి చరిత్ర సృష్టిస్తాడు. ఈ 800 వికేట్ల జర్నీ మీద ఎక్కువ కథ నడుస్తుంది.
కాగా, 800 సినిమా మొదటినుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ సినిమాలో మొదటగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ముత్తయ్య మురళీధరన్ పాత్ర కోసం అనుకున్నారు. అయితే, కొంతమంది తమిళులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విజయ్ సేతుపతిపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన సినిమానుంచి తప్పుకున్నారు. తర్వాత మధుర్ మిత్తల్ ముత్తయ్య పాత్రకోసం ఎంపిక అయ్యారు. సినిమా విడుదల సందర్భంలో కూడా కొంతమంది గొడవకు దిగారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమా విడుదలై విజయాన్ని నమోదు చేసింది. మరి, 800 సినిమా ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.