Mana Oori Pandavulu : చిరు నట ప్రస్థానంలో రెండో మైలురాయి

1978. రెబెల్ స్టార్ కృష్ణంరాజుగారి దగ్గర మేకప్ మెన్ గా అపార అనుభవంతో ఆ సంఘం ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయకృష్ణ నిర్మాతగా మారి మంచి అభిరుచి కలిగిన సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న సమయం.

1978. రెబెల్ స్టార్ కృష్ణంరాజుగారి దగ్గర మేకప్ మెన్ గా అపార అనుభవంతో ఆ సంఘం ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయకృష్ణ నిర్మాతగా మారి మంచి అభిరుచి కలిగిన సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న సమయం.

1978. రెబెల్ స్టార్ కృష్ణంరాజుగారి దగ్గర మేకప్ మెన్ గా అపార అనుభవంతో ఆ సంఘం ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయకృష్ణ నిర్మాతగా మారి మంచి అభిరుచి కలిగిన సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న సమయం. కథల కోసం వెతుకుతూ ఉండగా కన్నడలో నిర్మాణంలో ఓ చిత్రం గురించి ఆయనకు తెలిసింది. పుట్టన్న దర్శకత్వంలో రూపొందుతోందని కనుక్కుని అక్కడికి వెళ్లి ఫైనల్ వెర్షన్ విని అక్కడిక్కడే రీమేక్ హక్కులు కొనేసి మదరాసు వచ్చేశారు. సబ్జెక్టు విన్న కృష్ణంరాజుగారు చాలా బాగుందని అభినందించడమే కాదు ఇందులో ఓ పాత్ర వేస్తానని మాట ఇచ్చేశారు.అంతకన్నా కావాల్సింది ఏముంటుంది

అలా మన ఊరి పాండవులుకు శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప కథాంశాన్ని బాపు గారైతేనే న్యాయం చేయగలరని భావించిన జయకృష్ణ ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ స్క్రీన్ ప్లే మాటలు సిద్ధం చేశారు. క్యాస్టింగ్ లో మురళిమోహన్, ప్రసాద్ బాబు, భానుచందర్, విజయభాస్కర్ తదితరుల ఎంపిక పూర్తి కాగా అర్జునుడి లక్షణాలు ఉన్న పార్ధు పాత్ర వేట కొనసాగుతోంది. అప్పటికి ఒకే సినిమా విడుదలైన అనుభవమున్న చిరంజీవి ఫోటో ఓ ఆల్బమ్ లో కనిపించింది. ఆ కళ్ళలో కసి బాపు గారు పట్టేశారు. మరో ఆలోచనలేకుండా వెంటనే పిలిపించమన్నారు. అలా చిరు ప్రయాణంలో ఈ మలుపు కలిసింది.

చాలా కీలకమైన దుర్మార్గుడైన ఊరి జమిందార్ పాత్రను రావు గోపాల్ రావు నభూతో నభవిష్యత్ అనే రీతిలో పోషించగా ఆయనకు అసిస్టెంట్ క్యారెక్టర్ లో అల్లు రామలింగయ్య గారు ప్రాణం పెట్టారు. ఈ షూటింగ్ జరుగుతూ ఉండగానే అల్లువారమ్మాయి సురేఖతో చిరంజీవికి పెళ్లి సంబంధం కుదరటం జరిగిపోయింది. కృష్ణంరాజు కోసం ప్రత్యేకంగా విలన్ తమ్ముడిని సృష్టించడం బాగా ప్లస్ అయ్యింది. రాజమండ్రి పరిసరప్రాంతాల్లో సుమారు పన్నెండు లక్షల బడ్జెట్ తో సినిమా పూర్తయ్యింది. 1978 నవంబర్ 9న మనవూరి పాండవులు విడుదలై మంచి విజయం సాధించింది. హిందీలో బోనీకపూర్ హం పాంచ్ పేరుతో రీమేక్ చేసి హిట్టు కొట్టడం విశేషం

Also Read : Kalyanaramudu : రెండు పాత్రల్లో కమల్ విలక్షణ నటన – Nostalgia

Show comments