iDreamPost
ఇక అక్కినేని విషయానికి వస్తే ఏఎన్ఆర్-నాగార్జున ఫస్ట్ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టిన సినిమా 'కలెక్టర్ గారి అబ్బాయి'. ఆ విశేషాలు చూద్దాం.
ఇక అక్కినేని విషయానికి వస్తే ఏఎన్ఆర్-నాగార్జున ఫస్ట్ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టిన సినిమా 'కలెక్టర్ గారి అబ్బాయి'. ఆ విశేషాలు చూద్దాం.
iDreamPost
స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ లో తండ్రి కొడుకులు కలిసి నటించడం పెద్ద విశేషం కాదనుకుంటాం కానీ ఇక్కడా అంచనాల బరువును మోయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి ఫుల్ లెన్త్ రోల్ చేయడానికి పదిహేనేళ్ళు పట్టింది. ఎన్టీఆర్ బాలయ్యలకు ఈ ఇబ్బంది రాలేదు. కారణం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలోనే నాన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కాబట్టి. స్టార్ ఇమేజ్ వచ్చాక బ్రహ్మర్షి విశ్వామిత్రలో కలిసి నటిస్తే వర్కౌట్ కాలేదు. అదే వాళ్ళిద్దరి చివరి కలయిక. ఇక అక్కినేని విషయానికి వస్తే ఏఎన్ఆర్-నాగార్జున ఫస్ట్ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టిన సినిమా ‘కలెక్టర్ గారి అబ్బాయి’. ఆ విశేషాలు చూద్దాం.
1986లో విక్రమ్ తో తెరంగేట్రం చేశాక నాగార్జునకు అమాంతం మార్కెట్ పెరిగిపోలేదు. డెబ్యూ మూవీ సక్సెస్ అయినా కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ, సంకీర్తన దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. దాసరి తీసిన మజ్ఞు సూపర్ హిట్ గా నిలిచి తనలో అసలైన యాక్టింగ్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సమయంలో ఇద్దరం కలిసి చేస్తే అనే ఆలోచనను నాగ్ తో పంచుకున్నారు ఏఎన్ఆర్. ప్రముఖ నవల రచయిత కొమ్మనపల్లి గణపతిరావు రాసిన ఒక నవల ఆధారంగా ఆంజనేయ పుష్పానంద్, రామ్ మోహన్ రావులు కలిసి ఒక కథను తయారుచేశారు. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ దొరికింది.
గణేష్ పాత్రో సంభాషణలు సమకూర్చగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. దర్శకుడిగా తెలుగులో కేవలం ఒక్క సినిమా(ప్రతిధ్వని) అనుభవం ఉన్న బి గోపాల్ కి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ గోపాల్ భయపడలేదు. చట్టానికి న్యాయానికి కట్టుబడ్డ ఓ కలెక్టర్ కి, ప్రతిదీ అదే దారిలో వెళ్తే దుర్మార్గుల ఆట కట్టించలేం అని నమ్మే కొడుక్కు మధ్య సంఘర్షణే ఈ సినిమా. హీరోయిన్ గా రజని ఇతర పాత్రల్లో శారద, నూతన్ ప్రసాద్, కోట, సుధాకర్ తదితరులు ఇతర తారాగణం. అన్ని అంశాలు మేళవించి బి గోపాల్ సినిమాని తీర్చిదిద్దిన తీరు క్లాసు మాస్ అందరికీ నచ్చేసింది. 1987 ఏప్రిల్ 9 విడుదలైన కలెక్టర్ గారి అబ్బాయి వంద రోజులు పూర్తి చేసుకుంది. దీనికే రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం కొసమెరుపు.
Also Read : 2005 Hit Movies : పోటీ ఎంతున్నా విషయమున్న సినిమాకే విజయం – Nostalgia