iDreamPost
android-app
ios-app

జగన్‌ సరికొత్త ప్రణాళిక… పేద, మధ్యతరగతి కల నిజమవడం ఖాయం..

జగన్‌ సరికొత్త ప్రణాళిక… పేద, మధ్యతరగతి కల నిజమవడం ఖాయం..

ఇళ్లు, లేదా ఇళ్ల స్థలం కోసం లక్షలాది మంది ఎదురుచూపులు. ప్రభుత్వం ఇచ్చే వందల ఇళ్ల కోసం వేలల్లో దరఖాస్తులు. వంద మందికి గాను నలుగురైదుగురికే ఇళ్లు. మళ్లీ నిరాశ. మళ్లీ దరఖాస్తులు. మున్సిపల్‌ కార్యాలయంలో, తహసీల్దార్‌ కార్యాలయంలో,  నేతలకు .. ఇలా పలుమార్లు దరఖాస్తులు సమర్పించినా.. ఫలితం దక్కదు. ఇది నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి. ఈ స్థితిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది.

ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ స్థలం ఇచ్చేందుకు బృహత్తర నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన విధంగా 25 లక్షల మందికి 5 ఏళ్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీలో భాగంగా అర్హులైన వారికి ముందు ఇళ్ల స్థలం ఇస్తున్నారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుని ఆ మేరకు భూములు సేకరిస్తోంది. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం 25 లక్షలు కాగా ఇంకా రెండు లక్షల తక్కువగానే దరఖాస్తులు రావడం గమనార్హం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయంతో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి కోసం, ఇంటి స్థలం కోసం ఏ ఒక్కరూ ఎదురుచూసే దుస్థితిని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తప్పించబోతోంది.

ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచించబోతోంది. 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం ఈ మేరకు వచ్చే ఆర్థిక ఏడాదిలో 10 లక్షల ఇళ్లు మంజూరు చేయాలన్న లక్ష్యంతో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల రూపాయల విలువైన మెటిరీయల్, నగదు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇళ్లు సౌకర్యవంతంగా నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆశక్తి చూపితే.. ఆ మేరకు వారి ఆదాయ వనరులను బట్టీ ప్రభుత్వమే బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదీ పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాలని ప్రభుత్వంలో చర్చలు సాగుతున్నాయి.

ఇళ్ల నిర్మాణం తర్వాత సదరు ఇంటిని ఆ ఇంటి మహిళపై రిజిస్ట్రేషన్‌ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. తద్వారా ఆ ఇళ్లు సదరు కుటుంబానికి ఓ ఆస్తిగా ఉపయోగపడనుంది. ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకునేలా వెలుసుబాటు కల్పిస్తామని ఎన్నికల సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చేస్తున్న ఆలోచన కార్యరూపం దాల్చితే.. రాష్ట్రంలో పేద,మధ్య తరగతి ప్రజలకు సౌకర్యవంతమైన సొంత ఇంటి కల నెరవేరడం మాత్రం ఖాయం. సొంతింటి రూపంలో విలువైన ఆస్తి ఆయా కుటుంబాలకు దక్కనుంది.