iDreamPost
android-app
ios-app

నేతన్నకు అండగా నాడు వైయస్సార్ నేడు జగన్

  • Published Jun 21, 2020 | 5:46 AM Updated Updated Jun 21, 2020 | 5:46 AM
నేతన్నకు అండగా నాడు వైయస్సార్ నేడు జగన్

మన చేనేతలు ప్రపంచ కీర్తి కిరీటాలు గెలుచుకున్నారు. అగ్గిపెట్టిలో పట్టేంత చీరలు నేసిన ఘనత మన నేతన్నలది. మంగళగిరి , వెంకటగిరి, ధర్మవరం చేనేతలు జగతినే జయించిన చరిత్ర మనది. నరం నరం పోగుచేసి నాణ్యమైన నూలు నేసి అందమైన చీరగా అందించిన కీర్తి మనది. ఇంతటి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు శ్రమ నైపుణ్యాలు గల ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. వ్యవసాయం తరువాత అతి పెద్ద పరిశ్రమ ఇదే. దేశ విదేశి స్థాయలలో ఎన్నో బహుమతులు, కితాబులు,నజరానాలు, పచ్చల శాలువాలు అందిపుచ్చుకున్న అద్భుత పరిశ్రమ.

అతి ప్రాచీనమైన పరిశ్రమ గత ప్రభుత్వ పాలనా వైఫల్యం వలన పూట గడవక బ్రతకటం కోసం వలస పోయారు. ప్రభుత్వ విధానల మూలంగా ప్రగతి చక్రాలు ఆగాయి. మగ్గాలు నిలిచాయి. చేనేత కేంద్రాలు మూతపడ్డాయి, సహకార సంఘాలు విలవిల్లాడాయి. కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇవన్నీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల వలన జరిగిన అనర్ధాలు. ప్రపంచ బ్యాంకు , సింగపూరు అంటు వీదేశి మోజులో తీసుకున్న అనైతిక అనాలోచిత నిర్ణయాలతో నేతన్నల జీవితం స్తంభిస్తుంది. మగ్గాలు పట్టిన చేతులతో తాపీలు పట్టారు ఎందరో భవన నిర్మాణ కార్మికులుగా మారారు. అప్పుల బాధతో జీవించలేక ఆత్మాభిమానం చంపుకుని బ్రతకలేక మరణించిన ఘటనలు జరిగాయి.

ఈ దుస్థితికి కారణం తెలుగుదేశం విధానాలు అని చెప్పడంలో సందేహం లేదు. 1995 నుండి 2004 వరకు పాలన సాగించిన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న పాలనా నిర్ణయాల వలన కుదేలైన చేనేతలకు అండగా నాడు వై.యస్ ప్రభుత్వం లొకి రాగానే భేషరతుగా 327 కోట్లు చేనేత రుణమాఫి చేసి , 3 లక్షల మంది చేనేతలకి లబ్ధి చేకుర్చారు. ఆ తరువాత ఆయన ఉన్న 5 ఏళ్ళలొ ఎన్నో నిర్ణయాలతొ చేనేతలకు ఆసరాగ నిలిచారు

చేనేతలకి వై.యస్ హయాంలో భరోసా

తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఆత్మహత్య చేసుకున్న 200 మంది సిరిసిల్ల చేనేత కార్మికులకి ఒక్కొక్కరికి 1.50 లక్షల రూపాయలు ఇచ్చారు వై.యస్. అత్యంత వెనకబడిన 143 మంది చేనేతకార్మికులని గుర్తించి సి.యం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి 25వేల రూపాయలు ఇచ్చారు. సాహసోపేత పాదయాత్రలో వీరి అవస్తలు కళ్ళారా చూసిన వై.యస్ ప్రభుత్వంలోకి రాగానే (2004) భేషరతుగా 327 కొట్లు చేనేత రుణమాఫి చేసి, 3 లక్షల మంది చేనేతలకి లబ్ధి చేకుర్చారు. 2009లో మళ్ళీ వై.యస్ అధికారంలోకి రాగానే చేనేతలకి 312 కోట్లు రుణమాఫి చేస్తున్నట్టు జీవో పాస్ చేశారు  ఇలా చేసిన కొద్ది రొజులకే వై.యస్ చనిపోతే ఆ హామిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

Also Read: విశాఖ – వై.యస్ పాలనలో గ్రేటర్ హోదా – జగన్ పాలనలో క్యాపిటల్ హోదా

చేనేత కార్మికులకి ఆర్తిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం ద్వార పావల వడ్డీకే రుణాలు ఇచ్చారు. చేనేతలకి మాత్రం 50 ఏళ్ళు దాటితే వారిని పెన్షన్ స్కీంలో చేర్చి నెలకు 200 రూపాయల పెన్షన్ ఇచ్చారు వై.యస్. (మిగతవారికి మాత్రం 65 ఏళ్ళు దాటితేనే పెన్షన్ ). చంద్రబాబు ఆనాడు చేనేతలకి 65 ఏళ్ళు వచ్చాక 30 వేల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. కాని వై.యస్ 50 ఏళ్ళ నుండి పెన్షన్ ఇచ్చారు వీరి సంఖ్య 70 వేలు. అంత్యోదయ యోజన పథకం ద్వారా చేనెతలకి 35 కిలొల బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చారు వై.యస్. చేనేతలు అధికంగా ఉన్న సిరిసిల్ల మండలంలో 5 వేల మందికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసి కట్టిన ఘనత వై.యస్ ది.

చంద్రబాబు హయాంలో ఆప్కోలో 35 కోట్ల టర్నోవర్ ఉండేది. వై.యస్ దానిని 250 కోట్ల వరకు పెంచారు. నల్గొండ జిల్లా కనుముక్కల గ్రామంలో 24 ఎకరాలలో 43 కోట్లు పెట్టి టెక్స్టైల్ పార్క్ పెట్టారు దీని ద్వార 10 వేల మంది నేతన్నలకి ఉపాధి దొరికి నెలకు 5 వేలు లబ్ది పొందారు.నేతన్న పిల్లలకు కూడా వై.యస్ ఫీజ్ రీయంబర్స్ మెంట్ వర్తించింది. దీని ద్వార ఎంతో మంది డబ్బు లేకపోయినా చదువుకున్నారు.ఒకానొక సందర్భంలో అమెరికాకి వై.యస్ వ్యవసాయ సదస్సు కి వెళ్ళినప్పుడు అందరు “సార్ ఇది అమెరికా సూటు వెసుకోండి” అంటే , నేను తెలుగువాడిని , ఆంధ్రుడను, రైతు బిడ్డను అని చేనేత నేసిన ఖద్దరు మాత్రమే ధరించారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు వారానికి ఒక రోజు నేతన్నలు నేసిన బట్టలు కట్టుకుని రావాలి అని డ్రస్ కోడ్ పెట్టి – దీనికి ఒక జీవో పాస్ చేసారు వై.యస్. ఏటా ఆగస్టు ఏడున చేనేత దినోత్సవం జరపాలని 2009లో వై.యస్ హయాంలోని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న నెలకే వై.యస్ చనిపోయారు  తరువాత పాలకులు దీనిని పట్టించుకోలేదు.

ఇలా అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టున వైయస్ హయాంలో కుదుటపడుతుందనుకున్న పరిశ్రమ ఆయన మరణం తరువాత మళ్ళి తిరోగమనం వైపు నడిచింది .1995 నుండి 2004లో ఉన్న పరిస్థితికి తిరిగి వచ్చింది. 2014లో 600 మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం చేనేత రుణమాఫి హామీతో పాటు సుమారు చేనేతకు ఇచ్చిన 25 హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంతో  కార్మికులకు గిట్టుబాటు ధర లేక పలు సంఘాలు మూతపడ్డాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తే సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తానని, చేనేత వృద్ధులకు ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేక ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు నిర్మిస్తానని, ఆవాసం లేని కార్మికులకు మగ్గం షెడ్డుతో కూడిన ఇళ్ళు ఉచితంగా నిర్మించి ఇస్తానని చంద్రబాబు నాయుడు వాగ్థానం చేశారు. ఐదు బడ్జెట్లకు కలిపి రూ.5 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ.819 కోట్ల 72 లక్షలు కేటాయించి అందులో సగం మాత్రమే ఖర్చు పెట్టారు.

Also Read: అదే నమ్మకం, అదే ధీమా, అదే విసురు తండ్రి వైఎస్సార్ బాటలో జగన్

ప్రతిపక్షనేతగా జగన్ సాగించిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతీ జిల్లాలో నేతన్నలు పడుతున్న కష్టం చూసి తాను అధికారంలోకి రాగానే మగ్గం ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. గడచిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే గతంలో ఏ ముఖ్యమంత్రి చెయని విధంగా ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90% హామీలు నేర్వేర్చారు, ఇందులో భాగంగా ఇప్పటికే చేనేతలకు 600కోట్ల మేర లబ్ది చేకూర్చారు. గత ఏడాది డిసెంబరు 21న జగన్ గారి పుట్టినరోజు సంధర్భంగా వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్రంలో దాదాపు 85 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చారు.

చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ.3.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. చేనేత సహకార సంఘాలకు గత సర్కారు బకాయిలు రూ.103 కోట్లు విడుదల చేశారు.  చేనేత, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించారు. మాస్కుల తయారీకి సేకరించిన ఆప్కో వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేశారు.  ఇక తాజాగా కరోనా కారణంగా పనులు లేక చేనేతలు ఆర్ధికంగ పడుతున్న ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన దాని కన్న 6 నెలలు ముందుగానే 2వ విడత వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించిన డబ్బు మొత్తం 196.46 కోట్లను నేతన్నల ఖాతాలలోకి జమ చేశారు. ఐదేళ్లలో ప్రతి చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు నేరుగా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వాల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన చేనేత పరిశ్రమను తిరిగి గాడిలో పడేలా నాడు వై.యస్ నేడు జగన్ తీసుకున్న చర్యలతో నేతన్నలలో భవిష్యత్తుపై భరోసా రెట్టింపైందనే చెప్పాలి.