కరోనాపై జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఈ నేపథ్యంలో కాసేపట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా నివారణలో భాగంగా కలెక్టర్లతో జగన్ చర్చించనున్నారు. అనంతరం జగన్ మీడియా మీట్ నిర్వహిస్తారనిసమాచారం. నేపథ్యంలో సీఎం జగన్ కరోనా పై ప్రజలకు ఏమి చెప్పబోతున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ ఈ రోజు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యున్నత స్థాయి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నాడు. కరోనా వ్యాప్తి ని అరికట్టడానికి ఏపీలో తీసుకుంటున్న చర్యలను జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి వివరించనున్నాడు.
కాగా కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే, ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి తప్ప భయాందోళనలు కల్పించవద్దని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో జగన్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.