iDreamPost
android-app
ios-app

రక్షా బంధన్ వేళ అన్నకు కిడ్నీ దానం చేసిన చెల్లెలు.. సెల్యూట్ చెల్లెమ్మ!

రక్షా బంధన్ వేళ అన్నకు కిడ్నీ దానం చేసిన చెల్లెలు.. సెల్యూట్ చెల్లెమ్మ!

దేశ వ్యాప్తంగా రాఖీ సందడి అప్పుడే ప్రారంభమైంది. తోడ బుట్టిన వాళ్లకు అక్కా, చెల్లెళ్లు రాఖీ కడుతూ అనుబంధాన్ని తెలియజేసుకుంటున్నారు. అయితే రక్ష బంధాన్ వేళ ఓ చెల్లెలు అన్నకు ఊహించని కానుక ఇచ్చింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అన్నకు ఏకంగా కిడ్నీ దానం చేసి ఇది కదా అసలైన అన్న చెల్లెళ్ల అనుబంధం అని తెలియజేసింది. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుకుని స్థానికులు ఈ యువతిని ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన హరేంద్ర (35) అనే వ్యక్తి స్థానికంగా సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతడు గత రెండేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటవల అతడు మరోసారి ఆస్పత్రిలో చేరగా.. ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్ అయిందని, ఖచ్చితంగా డయాలసిస్ చేసుకోవాలని సూచించారు. ఈ సమయంలొ వారి కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే హరేంద్ర సోదరి అయిన ప్రియాంక అన్న పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయింది. తోడబుట్టిన అన్నకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది.

యువతి సహోసేపేత నిర్ణయాన్ని వైద్యులు సైతం మెచ్చకున్నారు. ముందుగా ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయంతో చివరికి వాళ్లు కూడా కాదనలేక స్వాగతించారు. ఆ తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేసిన ప్రియాంక కిడ్నీ తీసి ఆమె సోదరుడు హరేంద్రకు అమర్చారు. దీంతో అతడి ఆరోగ్యం మెరుగు పడిందని వైద్యులు తెలిపారు. కానీ, కిడ్నీ దానం చేసిన ప్రియాంకకు భవిష్యత్ లో అనారోగ్య సమస్యలు రావచ్చని హెచ్చరించారు. మొత్తానికి సోదరి చేసిన సాయాన్ని అన్నకు తెలియడంతో కన్నీళ్లతో చెల్లెలి కాళ్లు కడిగాడు. రక్షా బంధన్ వేళ సోదరి అన్నకు ఇచ్చిన నిజమైన కానుక అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. అన్నకు కిడ్నీ దానం చేసిన చెల్లెలి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.