iDreamPost

ఆ ఊర్లో మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు..

ఆ ఊర్లో మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు..

ప్రస్తుతం సమాజంలో ఎన్నో అంతుచిక్కని వ్యాధులు ఉన్నాయి. అవి తరచూ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేవలం పట్టణాల్లోనే కాకుండా మారమూల గ్రామాల్లో సైతం వింత వ్యాధులు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఓ గ్రామంలో అంతు చిక్కని వ్యాధిలో పిల్లలు క్షణాల్లో మరణిస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన పసిపిల్లలు.. క్షణాల్లో అస్వస్థతకు గురై.. విగతజీవులుగా మారుతున్నారు. సమీపంలో ఆస్పత్రి ఉన్న.. తీసుకెళ్లే లోపే పిల్లలు మరణిస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో శిశువులు మృతి చెందడంతో ఆ గ్రామంలో మహిళలు గర్బం దాల్చాలంటనే భయపడుతున్నారు. ఈ వింత వ్యాధి ఏపీలోని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

అప్పటి వరకు బాగానే ఉన్న పిల్లలు అంతుచిక్కని వ్యాధిలో అంతలోనే మరణిస్తున్నారు. ఈ గ్రామంలో 20 మంది మూడు నుంచి ఆరు నెలల వయస్సున శిశువులు మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పెదబయలు మండలంలోని రూఢకోట గ్రామంలో ఈ పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కొందరు చంటి పిల్లలు ఒకే రకంగా చనిపోవడం ఈ ఊరి వారిని కరవరపెడుతోంది. ఇక పిల్లల్ని కనకూడదనే నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యాన్ డ్రైవర్ పిల్లలు అలాగే చనిపోయారు.

తమ పిల్లలు ఎందుకు చనిపోతున్నారో అర్ధం కాక ఆ తల్లిదండ్రులు ఆయోమయానికి గురవుతున్నారు. 2022 చివరి మూడు నెలల్లో 17 మంది శిశువులు, 2023 తొలి మూడు నెలల్లో మరో ముగ్గురు వింత వ్యాధితో చనిపోయారని స్థానిక వైద్యుడు తెలిపారు. రూఢకోట గ్రామంలోనో కిలోమీటర్ దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. పిల్లలు  అస్వస్థకు గురైన వెంటనే అక్కడి తీసుకెళ్లే సమయం కూడా ఉండటం లేదని  ఆ గ్రామ మహిళు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చేతులు బిగుసుకుని, కళ్లు బయటకు తెరచి అలానే కుప్పకూలి పోతున్నారని.. స్థానిక మహిళలు అంటున్నారు. ఈ వరుస మరణాలపై  2022లో ఈ గ్రామంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్య బృందం పర్యటించింది. కానీ మరణాలకు స్పష్టమైన కారణాలను కనిపెట్టలేకపోయింది.

ఆ సమయంలో నీటిని పరిశీలించి.. అవి కూడా బాగానే ఉన్నట్లు ఆ బృందం తేల్చింది. అయితే ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.  డెలివరీ అయ్యే వరకు ఈ ఊర్లో ఉండాలంటే భయం భయంగా ఉందని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అకాల మరణాలతో పిల్లలలను కనడానికి, గర్భం దాల్చడానికి అక్కడి మహిళు భయపడుతున్నారు. ఐటీడీఏ పీవో అభిషేక్ మాట్లాడుతూ.. శిశు మరణాలపై అధ్యాయనం జరుగుతుందని  వైద్య సిబ్బంది నిరంతరం పరీక్షిస్తుందని ఆయన తెలిపారు. సురక్షిత మంచినీటి పాటు.. నాటు మందుల వాడకం, మద్యపానం వల్ల కలిగే నష్టాలను గురించి అవగాహన కల్పిస్తున్నామని అభిషేక్ తెలిపారు.

ఇదీ చదవండి: అనంతపురంలో రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి