iDreamPost
android-app
ios-app

అడ్డుకున్నాడన్న కోపంతో చెయ్యి నరికేశాడు…

  • Published Apr 12, 2020 | 10:51 AM Updated Updated Apr 12, 2020 | 10:51 AM
అడ్డుకున్నాడన్న కోపంతో చెయ్యి నరికేశాడు…

లాక్ డౌన్ ను ఉల్లంఘించి తిరుగుతున్న ముగ్గురు యువకులను అడ్డకున్నందుకు ఓ పోలీసులు తన చెయ్యిని పోగోట్టుకున్నాడు. తమను అడ్డుకున్నాడన్న కోపంతో ముగ్గురిలోని ఓ యువకుడు తల్వాత్ తీసి పోలీసు చెయ్యి నరికేసిన ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. దేశవ్యాప్త లాక్ డౌన్లో భాగంగా పంజాబ్ లో కూడా గట్టిగానే పోలీసులు అమలు చేస్తున్నారు.

పంజాబ్ లోని పాటియాలలోని ఓ మార్కెట్ దగ్గర పోలీసులు ఆదివారం ఉదయం డ్యూటి చేస్తున్నారు. మార్కెట్ దగ్గర రద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రోడ్డకు రెండు వైపులా బ్యారికేడ్లు అడ్డు కూడా పెట్టారు. అయితే బ్యారికేడ్లను కొట్టుకుంటు ఓ కారు మార్కెట్ దగ్గరకు వచ్చేసింది. దాంతో పోలీసులు కారును అడ్డుకుని అందులోని వాళ్ళని కిందకు దించారు. కారులో నుండి ముగ్గురు యువకులు కారులో నుండి దిగగానే పోలీసులపై మండిపోయారు.

అదే ఊపులో పోలీసులపై దాడి కూడా చేశారు. ముగ్గురిలో ఓ యువకుడు ఏఎస్ఐ హర్జీత్ సింగ్ పై దాడి చేసి తమ కారునే నిలిపేస్తారా అంటూ అరుస్తు తల్వార్ తీసి చేతిని నరికేశాడు. ఇంతలో విషయం తెలుసుకుని మరికొంతమంది పోలీసులు కూడా అక్కడకు చేరుకోవటం, ముగ్గురు యువకులను అదపులోకి తీసుకోవటం అన్నీ అయ్యాయి లేండి. వెంటనే ఏఎస్ఐని కూడా పోలీసులు దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి కూడా తరలించినట్లు డిజిపి దినకర్ గుప్తా తెలిపారు.

పంజాబ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 151కి చేరుకోగా 12 మంది మరణించారు. మొత్తం మీద వైరస్ వ్యాపించకుండా పంజాబ్ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటోంది. ఇందులో భాగంగానే లాక్ డౌన్ ను చాలా పటిష్టంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే పాటియాలోని మార్కెట్ దగ్గర దురదృష్టకరమైన ఘటన జరిగింది. మొత్తం మీద పోలీసుల మీదే దాడి చేయటం, ఒకరి చెయ్యి నరికేయటం సంచలనంగా మారింది.