iDreamPost
android-app
ios-app

వాళ్ళు ఎగ్గొట్టిన బకాయిలు కూడా జగన్ చెల్లించాలంటా…

  • Published Apr 24, 2020 | 5:52 PM Updated Updated Apr 24, 2020 | 5:52 PM
వాళ్ళు ఎగ్గొట్టిన బకాయిలు కూడా జగన్ చెల్లించాలంటా…

వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ఈ రోజు జగన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తాలూకూ డ్వాక్రా మహిళల వడ్డీ బకాయిలు 1400 కోట్లు చెల్లించటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండాగా ప్రతిపక్ష టీడీపీకి మాత్రం కంటగింపుగా మారింది. ఇంత కష్టకాలంలో కూడా ఇన్ని వందల కోట్లు డ్వాక్రా మహిళకు ప్రభుత్వం చెల్లించటంతో “జగన్ చెప్తే చేస్తాడు” అన్న మాట మరోసారి నిరూపితమైందంటూ మహిళలు జగన్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.

కానీ మొన్నటి వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసి… మొత్తం చేసేశాము ,ప్రజలకు,మహిళలకు మా అంత సహాయం గతంలో ఎవరు చేయలేదంటూ ఊదరగొట్టిన యనమల రామకృష్ణుడు ఇప్పుడు కోత్త డిమాండ్ చేస్తున్నారు. తమ హాయంలో 2016 నుంచి డ్రాక్వా మహిళలకు చెల్లించకుండా ఎగ్గొట్టిన బకాయిలను జగన్ ఇప్పుడు చెల్లించాలంటా!జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అంటే 2019-2020 బకాయిలు మాత్రమే చెల్లించటం దారుణమంటా !!యనమల వాదం చూస్తుంటే , ఈ వడ్డీ బకాయిలేనా లేక గత ప్రభుత్వం చెల్లించని మిగతా హామీల బకాయిలు కూడా  చెల్లించమంటారేమో! 

గత టీడీపీ ప్రభుత్వం 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఋణమాఫీ 86 వేల కోట్లను కుదించి 24 వేల కోట్లు ఐదు దఫాలుగా చెల్లిస్తామని చెప్పి చివరికి మూడు దఫాల్లో సుమారు 14 వేల కోట్లు చెల్లించగా పదివేల కోట్ల బకాయి మిగిలిపోయింది . సంపూర్తి డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి కనీసం ఐదోవంతు ఋణం కూడా చెల్లించలేదు.

అక్కచెల్లెమ్మల బంగారం కుదవ బెట్టి తీసుకొన్న లోన్లు చెల్లించి వాళ్ళ బంగారం విడిపిస్తామన్న హామీకి దిక్కులేదు .
ప్రతి డ్వాక్రా మహిళకు వ్యక్తిగతంగా లక్ష రూపాయల వరకూ వడ్డీ లేని రుణం ఇస్తామని ఇవ్వలేదు .
2019 ఎన్నికల ముందు ప్రతి డ్వాక్రా మహిళకు మార్చ్ నెలలో ఇస్తామన్న స్మార్ట్ ఫోన్స్ అందించలేదు .
ఇంకా చేనేత,కాపు కార్పొరేషన్ లకు 5000 కోట్ల చొప్పున కేటాయిస్తామని హామీలిచ్చి ఎన్నికల తర్వాత గాలికొదిలేశారు .

టీడీపీ హాయంలో ఎగ్గొట్టిన వడ్డీ బకాయి ఇప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని తీర్చమని డిమాండ్ చేసినట్లే ఈ బకాయిలు కూడా తీర్చమని భవిషత్తులో యనమల డిమాండ్ చేస్తారేమో?

టీడీపీ నేత యనమల లెక్క ప్రకారం జగన్ కూడా తన హామీలేవి నెరవేర్చకుండా చంద్రబాబు హామీ ఇచ్చి ఎగ్గొట్టిన బకాయిలు తీర్చాలేమో!ఇచ్చిన హామీలను తీర్చాలన్న సదుద్దేశ్యం లేకుండా ,అధికారంలో ఉన్నన్ని రోజులు పలు పథకాలు,హామీలతో రూపొందించిన టీడీపీ మేనిఫెస్టోను అమలు చేయకుండా, పక్కన పడేసి ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు మా హామీలను జగన్ తీర్చాలనటం యనమలకు చెల్లింది.