Idream media
Idream media
కరోనా నిర్ధారణ టెస్టులు చేయకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ మొన్నటిదాకా ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా కొత్త రాగం ఎత్తుకున్నారు. దేశంలోనే కరోనా నిర్ధారిత పరీక్షలు అధికంగా చేస్తున్న నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో కొత్త విమర్శలు, ఆరోపణల కోసం టీడీపీ నేతలు పోటీపడుతున్నారు. తాజాగా టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు అర్థం లేని వాదనలతో మీడియాకెక్కారు.
వైరస్ వ్యాప్తి రేటును తక్కువ చేసి చూపేందుకే ఎక్కువ టెస్టులు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోందని విషం కక్కారు. పాజిటివ్‌లు పెరిగాయి కాబట్టి వైరస్ వ్యాప్తి రేటు ఎలా తగ్గుతుందని ఆరోపించారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి టెస్టులుగానీ, పాజిటివ్‌లు దాచేస్తే దాగవు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మార్గాల్లో చేస్తున్న పరీక్షలకు కేంద్రం అనుమతి ఉంది. కేంద్రం విడుదల చేస్తున్న అధికాకారిక లెక్కల్లో సైతం ఏపీ ప్రభుత్వం చేస్తున్న టెస్టుల సంఖ్య యథాత«థంగా ఉంది. ఇందులో పొరపాటు ఉంటే ఇప్పటికే కేంద్రం ప్రశ్నించేది. ఈ లాజిక్కును యనమల ఎలా మర్చిపోయారో మరి ఆయనే చెప్పాలి. ఢిల్లీలో చేసిన టెస్టుల సంఖ్యను బట్టి ఇన్‌పెక్షన్ రేటు అక్కడ ఎక్కువగా ఉండగా, ఏపీలో అతి తక్కువగా ఉంది.
రాష్ట్రంలో ఆదివారం సాయంత్రానికి 68,034 టెస్టులు చేస్తే.. మొత్తంగా 1097 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇన్‌ఫెక్షన్ రేటు 1.66 శాతమే. దేశంలో పాజిటివ్‌ల శాతం 4.21గా నమోదైంది. అలాగే ఏపీలో పదిలక్షల జనాభాకు సగటున 1,274 టెస్టులు చేస్తున్నారు. దేశ సగటు 451 మాత్రమే. అలాగే రికవరీ రేటులోనూ ఏపీ మంచి గణాంకాలను నమోదు చేస్తోంది. ఇప్పటివరకు 231 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంటే 1,097 కేసులకు 21.05 శాతం రికవరీ రేటు నమోదైంది. దీన్ని బట్టి దేశంలో ఏపీ చాలా మెరుగ్గా ఉందని అర్థం అవుతుంది. కానీ ఎలాగైనా విమర్శలు చేసి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలని, భయాందోళనలకు గురి చేయాలని తెలుగు దేశం నేతలు పోటీ పడుతున్నారు.