Idream media
Idream media
తిరుమలలోని సన్నిధి గొల్లకు వంశ పారంపర్యంగా వస్తున్న వేంకటేశ్వరుడి తొలి దర్శన హక్కును గత పాలకులు కాల రాశారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా… ఆ వర్గానికి చెందిన వారందరూ.. మానసిక క్షోభకు గురి అవుతూ వచ్చారు. ప్రతి పక్షంలో ఉండగా ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ దృష్టికి యాదవులందరూ తీసుకెళ్ళి తమ ఆవేదనను వెలిబుచ్చారు. అది విన్న జగన్…. నేనున్నా అంటూ వారికి హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీ మరచి పోని ఆయన … తాజాగా అసెంబ్లీలో ఆ చట్టాన్ని ప్రవేశ పెట్టారు.
వంపారంపర్యంగా వస్తున్న స్వామి తొలి దర్శన భాగ్యాన్ని సన్నిధి గొల్లకు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు… ఆయా వర్గాల వినతి మేరకు.. సన్నిధి గొల్ల పేరును సన్నిధి యాదవ గా కూడా మార్చారు. జగన్ నెరవేర్చిన ఈ హామీపై యాదవ వర్గానికి చెందిన వారే కాదు… కొందరు అర్చకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 20 శాతానికి పైగా ఉన్న వారందరూ జగన్ కు క్షీరాభిషేకం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వైఎ్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను, ఎమ్మెల్యేలను కలిసి ధన్యవాదాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి.. యాదవులకు ఆ హక్కు ఎలా వచ్చింధో… ఆ హక్కు కోల్పోయినప్పుడు ఇంత కాలం ఎంత బాధ పడ్డారో చెబుతూ.. జగన్ తీసుకున్న నిర్ణయానికి దండం పెడుతూ ధన్యవాదాలు తెలిపారు.
స్వామి వారి సన్నిధిలో యాదవులకు వంశపారంపర్య హక్కు కల్పించడం హర్షణీయం అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని తెలిపారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు రుణపడి ఉంటామని చెప్పారు. ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. గతంలో సన్నిధి గొల్లలకు ఐదువేలు ఇచ్చేవారని, వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమస్యలు తెలుసుకుని 18 వేలు పెంచారని తెలిపారు.
జగన్ నిర్ణయం భేష్ : చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగ రాజన్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో ఎన్నో కులవృత్తుల వారు తర తరాలుగా ఉంటున్నారని చిలుకూరు బాలాజీ టెంపులు ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. కుల వృత్తుల ప్రభావం తెలియకుండా 1987లో అప్పటి ప్రభుత్వం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఏపీ అసెంబ్లిలో సన్నిధి గొల్లల వంశపారంపర్య హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య వంశస్తులు, నాయీ బ్రాహ్మణులకు త్వరలో వంశపారంపర్య హక్కులు కల్పిస్తారని ఆశిస్తున్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు