iDreamPost
iDreamPost
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తునట్టు ప్రకటించారు. తన చర్యను సమర్ధించుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. WHO సంస్థ చైనాకు అనుకులంగా పనిచేస్తుందని , చైనా ఏది చెబితే దానికి వత్తాసు పలుకుతుందని, ఈ వైరస్ మనిషి నుండి మనిషికి రాదు అని మొదట చెప్పి ఈ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని. కరోనా వైరస్ ప్రపంచం పై చూపే ప్రభావం పై తన అంచనా పూర్తిగా తప్పిందని , ఈ మహమ్మారినుండి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో WHO సంస్థ పూర్తిగా విఫలం చెందిందని చెప్పుకొచ్చారు.
అయితే అమెరికా అధ్యక్షుడు నిర్ణయాన్ని పలుదేశాధినేతలు తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా వైరస్ పంజా ప్రపంచం పై పడిన ఈ విపత్కర సమయంలో ప్రపంచం అంతా ఒక్కతాటి పై వచ్చి సాగిస్తున్న ఈ పోరును ట్రంప్ వాఖ్యలు బలహీన పరిచే విధంగా ఉన్నాయని ఐఖ్యరాజ సమితి తో పాటు ఇప్పటికే, ఫ్రాన్స్, నైజీరియా, జర్మనీ, చైనా దేశాలు తీవ్రంగా తప్పు పట్టాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కుంటున్న ఈ సమస్యను నిర్మూలించాలంటే అన్ని దేశాలు ఆరోగ్య సంస్థకు అండగా ఉండాలని ఐరాసా ప్రధాన కార్యదర్శి సూచించారు.
అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పై చేసిన ఆరోపణలకు ఆ సంస్థ స్పందిస్తు ట్రంప్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని, తాము ప్రపంచదేశాలకు జనవరి 5వ తారీఖునే హెచ్చరికలు జారీ చేశామని దీంతో అమెరికాతో పాటు మిగిలిన అన్ని దేశాలు జనవరి 6వ తారీఖు నుంచే కరోనా కట్టడికి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంబించాయని అలాగే అప్పటి నుంచి వారం వారం ప్రపంచదేశాలకు తమ సంస్థ నుంచి అప్డేట్స్ పంపామని ఈ వైరస్ శ్వాసకోశ సంభందిత వ్యాదిగ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా హెచ్చరిoచినట్టు వివరించారు .
ప్రపంచ దేశాలన్నిటి కన్నా ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు సమకూర్చే దానిలో 15%తో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు, ఆపై ఆ సంస్థ ఇచ్చిన సమాధానంతో ఈ నిధుల విషయంలో ఏం జరగబోతుందా అని ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయి..