డీసెంటే కానీ – WFL మొదటి రోజు వసూళ్లు

నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ టాక్ సంగతి పక్కనపెడితే మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సుమారుగా 4 కోట్ల 32 లక్షల దాకా వసూళ్లు తెచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. అందులో నైజామ్ నుంచే 2 కోట్ల పైచిలుకు రావడం గమనార్హం. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సెన్సిబుల్ లవ్ స్టోరీ యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంలో విఫలమయ్యింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ ఎంతమేరకు కలెక్షన్లను పుష్ చేస్తుందనే దాని మీద పెట్టుబడి సేఫా కాదా అనేది డిసైడ్ అవుతుంది.

థియేట్రికల్ బిజినెస్ జరిగిన 21 కోట్ల మొత్తాన్ని కేవలం షేర్ రూపంలో రాబట్టడం అంత ఈజీ కాదు. అందులోనూ వచ్చే వారం రానున్న నితిన్ భీష్మ మీద మంచి అంచనాలు ఉండటంతో ఒకవేళ అది హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు లవర్ కి కష్టాలు తప్పవు. ఈరోజు రేపు వీకెండ్ ని వరల్డ్ లవర్ ఎంత మేరకు ఉపయోగించుకుంటాడనే దాని మీద ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లె, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం సమకూర్చారు. సోమవారానికి వరల్డ్ ఫేమస్ లవర్ తాలూకు క్లారిటీ వస్తుంది. ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

AREA SHARE
నైజాం  2.05cr
సీడెడ్   0.38cr
ఉత్తరాంధ్ర  0.51cr
గుంటూరు   0.43cr
క్రిష్ణ   0.25cr
ఈస్ట్ గోదావరి  0.32cr
వెస్ట్ గోదావరి  0.20cr
నెల్లూరు   0.18cr
Total Ap/Tg  4.32cr

Show comments