వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మంచి స్కోరు సాధించింది. ఆ టీమ్ టెంపరరీ కెప్టెన్ నజ్ముల్ షంటో టాస్ నెగ్గాక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిట్టన్ దాస్ (66) షంటో నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ మొదట్లో బాల్ స్వింగ్ అవుతుండటంతో ఆరేడు ఓవర్ల పాటు స్లోగా ఆడారు. ఆ తర్వాత బాల్ బ్యాట్ మీదకు బాగా వస్తుండటంతో వెంటనే గేర్లు మార్చారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును రాకెట్ స్పీడ్‌తో పరిగెత్తించారు. అయితే 14వ ఓవర్ తర్వాత వచ్చిన డ్రింక్స్ బ్రేక్‌తో మ్యాచ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
బ్రేక్ టైమ్‌లో మ్యాచ్ కండీషన్, పిచ్ ప్రవర్తిస్తున్న తీరును బట్టి స్ట్రాటజీ మార్చుకున్న టీమిండియా అనుకున్నది సాధించింది. వెంట వెంటనే వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్ మీద ఒత్తిడి పెంచింది. ఓపెనర్లు తంజిమ్, లిట్టన్తో పాటు హృదోయ్, నసుమ్, ముష్ఫికర్ రహీమ్‌లను త్వరగా పెవిలియన్‌కు పంపింది. అయితే ఆఖర్లో సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా (46) బంగ్లా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు ఫైటింగ్ స్కోరును అందించాడు. మొత్తానికి 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. భారత బౌలర్లలో జడేజా, సిరాజ్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. శార్దూల్, కుల్దీప్కు ఒక్కో వికెట్ దక్కింది. బంగ్లాతో మ్యాచ్‌లో టీమిండియాకు ఒక షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.
బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన హార్దిక్ పాండ్యా తొలి మూడు బంతుల్ని బాగానే వేశాడు. అయితే నాలుగో బంతిని బ్యాటర్ లిటన్ దాస్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టగా దాన్ని ఆపేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు హార్దిక్. అతడి కాలి మడిమకు ఇంజ్యురీ కావడంతో గ్రౌండ్‌ను వీడాడు. దీంతో విరాట్ కోహ్లీ వచ్చి బేబీ ఓవర్ పూర్తి చేశాడు. గాయపడిన పాండ్యాను ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. అక్కడ తీసే స్కాన్స్‌లో గాయం తీవ్రత ఎంతనేది తేలుతుంది. ఒకవేళ ఇంజ్యురీ చిన్నదే అయితే అతడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వొచ్చు. గాయం తీవ్రత పెద్దదైతే మాత్రం మొత్తం వరల్డ్ కప్‌కు పాండ్యా దూరమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో భారత ఫ్యాన్స్ పాండ్యా త్వరగా కోలుకొని జట్టులోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: VIDEO: అద్భుతం.. క్యాచ్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఇదేనా!
Hardik Pandya taken for scans.
– Hope he’ll be alright, India needs him! pic.twitter.com/4VjqrCFQ3N
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023