iDreamPost
android-app
ios-app

IND vs BAN: కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ! ఎందుకంటే..?

  • Author singhj Published - 08:36 PM, Thu - 19 October 23
  • Author singhj Published - 08:36 PM, Thu - 19 October 23
IND vs BAN: కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ! ఎందుకంటే..?

వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. బంగ్లా టెంపరరీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థి బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. కానీ మొదట్లో స్లోగా ఆడిన బంగ్లా ఓపెనర్లు ఆ తర్వాత జోరు పెంచారు. తంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66) భారత పేసర్లపై కౌంటర్​ అటాక్​కు దిగారు. వరుసగా బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా యంగ్ బ్యాటర్ తంజిద్ అయితే ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ మన బౌలర్లను కంగారు పెట్టాడు.

డ్రింక్స్ బ్రేక్ వరకు వికెట్ కోల్పోకుండా 90కి పైగా రన్స్ చేసింది బంగ్లాదేశ్. కానీ బ్రేక్​లో రోహిత్ శర్మ టీమ్​మేట్స్​తో మాట్లాడుతూ.. పిచ్ గురించి, బౌలింగ్ ఎలా ఛేంజ్ చేయాలో చెప్పాడు. కెప్టెన్ ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేసిన టీమిండియా బౌలర్లు తర్వాత 40 పరుగుల గ్యాప్​లో 4 వికెట్లు తీశారు. జడేజా రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్, సిరాజ్​కు ఒక్కో వికెట్ లభించింది. 40 ఓవర్లు ముగిసేసరికి బంగ్లా స్కోరు 5 వికెట్ల నష్టానికి 189. ప్రస్తుతం మమ్మదుల్లా (6), ముష్ఫికర్ రహీం (35) క్రీజులో ఉన్నారు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ టైమ్​లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. దీనికి ఒక కారణం ఉంది. జడేజా బౌలింగ్​లో ముష్ఫికర్ రహీం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకుల్లోని ఒకరు బ్లాక్ స్క్రీన్​కు అడ్డంగా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాటింగ్​కు రెడీ అయిన ముష్ఫికర్ కాన్​సన్​ట్రేషన్ దెబ్బతింది. జడేజా బాల్ వేస్తే ముష్ఫికర్ బ్యాట్ ఊపకుండా పక్కకు జరిగిపోయాడు. అంపైర్ దాన్ని డెడ్​ బాల్​గా ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. బ్లాక్ స్క్రీన్​కు అడ్డంగా వచ్చిన వ్యక్తి వైపు చూస్తూ అరుస్తూ కనిపించాడు హిట్​మ్యాన్. ముష్ఫికర్ కూడా ఆ వ్యక్తిని తప్పుకోమన్నాడు. మొత్తానికి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తిరిగి గేమ్ స్టార్ట్ అయింది. మరి.. రోహిత్ కోపంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs BAN: టీమిండియాకు బిగ్‌ షాక్‌! స్టార్‌ ప్లేయర్‌కు గాయం