iDreamPost
android-app
ios-app

కెప్టెన్​గా రోహిత్ సక్సెస్​కు కారణమేంటో చెప్పిన మాజీ టీమ్​మేట్!

  • Author singhj Published - 05:07 PM, Wed - 18 October 23
  • Author singhj Published - 05:07 PM, Wed - 18 October 23
కెప్టెన్​గా రోహిత్ సక్సెస్​కు కారణమేంటో చెప్పిన మాజీ టీమ్​మేట్!

ఒకప్పుడు భారత జట్టులో అతడికి చోటు దక్కడమే కష్టంగా ఉండేది. 2011 వన్డే వరల్డ్ కప్​ టీమ్​లో ఆ ప్లేయర్​కు ప్లేస్ దక్కలేదు. గాయాల బారిన పడటం, ఫామ్ లేమి.. దీంతో టీమ్​లో అతడు అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తాయి. కట్ చేస్తే.. 2023 వన్డే వరల్డ్ కప్. టీమిండియాను కెప్టెన్​గా ముందుండి నడిపిస్తున్నాడతను. ఆ ప్లేయరో ఎవరో ఈపాటికే మీకు తెలిసిపోయి ఉంటుందిగా! అవును, మనం మాట్లాడుకుంటోంది భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించే. 2013 వరకు టీమ్​లో రోహిత్​ ప్లేస్ ఫిక్స్ కాదు. కానీ అప్పటి సారథి ఎంఎస్ ధోని హిట్​మ్యాన్​కు వెన్నంటే ఉండి వరుసగా అవకాశాలు ఇస్తూ పోయాడు. అంతేకాదు, ఆ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్​కు ఓపెనర్​గా ప్రమోషన్ ఇచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ-2013తో తానేంటో నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. అతనెంత డేంజరస్ బ్యాటరో అప్పుడే క్రికెట్​ వరల్డ్​కు తెలిసింది. ఆ తర్వాత సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు.. పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు రోహిత్. ఒకప్పుడు సిక్సర్ ఎలా కొడతారో, తన వల్ల కాదేమో అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు సిక్సర్ల కింగ్​గా మారాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ దగ్గర నుంచి ప్రస్తుత వన్డే వరల్డ్ కప్​లో జరిగిన మూడు మ్యాచుల వరకు హిట్​మ్యాన్ కెప్టెన్సీలోనూ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. టీమ్​లోని యంగ్ ప్లేయర్లకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. టైమ్​, సిచ్యువేషన్​కు తగ్గట్లుగా తెలివైన నిర్ణయాలతో జట్టును గెలిపించడమే గాక ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకుంటున్నాడు.

ప్లేయర్​గానూ, కెప్టెన్​గానూ దూసుకెళ్తున్న రోహిత్ శర్మ గురించి అతడితో కలసి ఆడిన మాజీ టీమ్​మేట్ అమోల్ మజుందార్ ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ‘రోహిత్​ను చాన్నాళ్లుగా గమనిస్తున్నా. అతడు తనను తాను ఎలా మలచుకున్నాడు, స్టార్​గా ఎలా ఎదిగాడో దగ్గరగా చూశా. అతడు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. చిన్న చిన్న విషయాలనూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాడు. మ్యాచ్ స్టాటిస్టిక్స్​కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. గ్రౌండ్​లో ప్రత్యర్థి ప్లేయర్ల కదలికల్ని అబ్జర్వ్ చేస్తాడు. వాళ్లను ఎలా దెబ్బ కొట్టాలి? వారిపై నెగ్గాలంటే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలకు స్పష్టంగా ఆన్సర్స్ వెతుక్కోగలడు. ఏ విషయాన్నైనా కాంప్లికేట్ చేయకుండా సింపుల్​గా పరిష్కరించేందుకు రోహిత్ ప్రయత్నిస్తాడు. టీమ్​మేట్స్ తనలాగే ఆలోచించేలా, వారిపై ఒత్తిడి లేకుండా చేయడంలో హిట్​మ్యాన్ స్పెషలిస్ట్. అదే అతడి సక్సెస్ సీక్రెట్’ అని మజుందార్ రివీల్ చేశాడు.

ఇదీ చదవండి: World Cup: ఒకప్పుడు సౌతాఫ్రికా టీమ్. నేడు టీమ్ మారి.. వాళ్లనే ఓడించాడు!