iDreamPost
android-app
ios-app

IND vs BAN: టీమిండియాకు బిగ్‌ షాక్‌! స్టార్‌ ప్లేయర్‌కు గాయం

  • Author singhj Published - 03:42 PM, Thu - 19 October 23
  • Author singhj Published - 03:42 PM, Thu - 19 October 23
IND vs BAN: టీమిండియాకు బిగ్‌ షాక్‌! స్టార్‌ ప్లేయర్‌కు గాయం

వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్​లో బంగ్లాదేశ్ బాగా ఆడుతోంది. టాస్ నెగ్గిన ఆ టీమ్ తాత్కాలిక కెప్టెన్ షాంటో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ షకీబల్ హసన్ ఈ మ్యాచ్​లో బరిలోకి దిగలేదు. దీంతో సారథ్య బాధ్యతల్ని తీసుకున్నాడు షంటో. బ్యాటింగ్​కు అనుకూలిస్తున్న పూణె పిచ్ మీద బంగ్లాకు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి 5 ఓవరల్లో ఆ జట్టు చేసింది కేవలం 10 పరుగులే. జస్​ప్రీత్ బుమ్రా స్వింగింగ్ డెలివరీస్​తో బంగ్లా బ్యాటర్లను కట్టిపడేశాడు. అయితే వికెట్ కాపాడుకున్న లిటన్ దాస్, తన్జిద్ ఆ తర్వాత అటాకింగ్​కు దిగారు.

తన్జిద్ (50 నాటౌట్) భారత బౌలర్లపై కౌంటర్ అటాక్​కు దిగాడు. ఔండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. పిచ్​పై కాస్త బౌన్స్ ఉన్నప్పటికీ టీమిండియా పేసర్లు పెద్దగా షార్ట్ బాల్స్ వేయలేదు. ఒకవేళ బౌన్సర్లు వేసుంటే ఆరంభంలో వికెట్లు దొరికే ఛాన్స్ ఉండేదేమో. అయితే టీమిండియా పేసర్లను ఎదుర్కొంటూ యంగ్ బ్యాటర్ తన్జిద్ ఆడిన ఇన్నింగ్స్ సూపర్బ్ అనే చెప్పాలి. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్లు కోల్పోకుండా బంగ్లా  89 రన్స్ చేసింది. ఇక, బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో టీమిండియాకు అనూహ్యంగా షాక్ తగిలింది. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తూ గాయపడ్డాడు.

ప్రధాన పేసర్లు బుమ్రా, సిరాజ్​కు వికెట్లు దక్కకపోవడంతో హార్దిక్ పాండ్యా బౌలింగ్​కు దిగాడు. అయితే బౌలింగ్ వేశాక బ్యాట్స్​మన్ కొట్టిన బంతిని ఆపే క్రమంలో కాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడు పాండ్యా. దీంతో వెంటనే ఫిజియో అక్కడికి వచ్చి పాండ్యా ఎడమ మోకాలికి ట్రీట్​మెంట్ అందించాడు. దీంతో అతడు తిరిగి బౌలింగ్ స్టార్ట్ చేశాడు. కానీ నొప్పి తగ్గకపోవడంతో గ్రౌండ్​ను వీడాడు. డ్రెస్సింగ్ రూమ్​లో పాండ్యా కాలికి అల్ట్రా సౌండ్ లాంటి పరీక్షలు చేసి ట్రీట్​మెంట్ అందిస్తారని తెలుస్తోంది. బౌలింగ్​కు దూరమైన పాండ్యా.. బ్యాటింగ్​కు దిగుతాడో లేదో సందేహంగా మారింది. మరి.. మెగా టోర్నీ కీలక దశలో పాండ్యా గాయపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విరాట్‌ కోహ్లీ చేసిన పనితో క్రికెట్‌లోకి వచ్చా: డచ్‌ క్రికెటర్‌