iDreamPost
android-app
ios-app

SS Rajamouli : రాజమౌళి ఆ కలయికని సాధ్యం చేస్తారా

  • Published Feb 19, 2022 | 5:45 AM Updated Updated Feb 19, 2022 | 5:45 AM
SS Rajamouli : రాజమౌళి ఆ కలయికని సాధ్యం చేస్తారా

ఇంకా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు కానీ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా తాలూకు అప్ డేట్స్ అప్పుడే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బ్యాక్ డ్రాప్ ఏంటో ఇంకా తెలియదు కానీ అడవి నేపథ్యంలో ఎవరూ ఊహించలేనంత గ్రాండియర్ తో ఉంటుందని లీక్స్ బయటికి వస్తున్నాయి. సర్కారు వారి పాట అయ్యాక మహేష్ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్లో చేరిపోతారు. అది ఎక్కువ ఆలస్యం కాదు. ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే జరుగుతోంది కాబట్టి ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆరు నెలల లోపే పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు 2023 సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ పెట్టుకోవచ్చు. మూడేళ్లుగా ప్రిన్స్ ఈ సీజన్ మిస్ అయ్యారు.

ఇక జక్కన్న మూవీ విషయానికివ్ వస్తే ఇందులో నలభై నిమిషాల పాటు సాగే కీలకమైన ఎపిసోడ్ ఒకటి ఉందట. చాలా పవర్ ఫుల్ గా సాగే ఓ క్యారెక్టర్ కోసం రాజమౌళి బాలకృష్ణ లేదా మోహన్ లాల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారట. పాత్ర తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి రాలేదు కానీ మహేష్ తో సమానంగా గుర్తింపు వచ్చే ఈ ట్రాక్ ని రచయిత విజయేంద్ర ప్రసాద్ గొప్పగా డిజైన్ చేశారట. కాకపోతే కాంబినేషన్ సీన్లు ఉండకపోవచ్చని అంటున్నారు కానీ దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అప్పుడే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుంది కనక వెయిట్ చేయక తప్పదు.

రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు రీ స్టార్ట్ చేసే పనిలో పడ్డారు. రిలీజ్ కు ఇంకా ముప్పై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. రామ్ చరణ్ శంకర్ షూటింగ్ తో బిజీ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి డేట్లు మరోసారి తీసుకోవాలి. ఆల్రెడీ నార్త్ లో చేయాల్సిన ఈవెంట్లు ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు సౌత్ మీద ఫోకస్ చేయాలి. హైదరాబాద్ లేదా వైజాగ్ కాదూ అనుకుంటూ రెండో చోట్లా గ్రాండ్ గా వేడుకలు చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. మొత్తానికి మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ ది త్వరగా పూర్తయితే రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు

Also Read : Virgin Story : వర్జిన్ స్టోరీ రిపోర్ట్