iDreamPost
iDreamPost
మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గా రీమేక్ రైట్స్ హాట్ గా అమ్ముడుపోయిన అయ్యపనుం కోశియం తెలుగు వర్షన్ లో బాలయ్యను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఒక టాక్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇది ఈగోలతో రగిలిపోయే ఓ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, అతని వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ మధ్య కథ. టేకింగ్ బాగా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కాకపోతే రెండు గంటల్లో చెప్పాల్సిన విషయాన్నీ ఏకంగా మూడు గంటలు చూపించారు. సరే పృద్విరాజ్, బిజు మీనన్ ల పోటాపోటీ యాక్టింగ్, దర్శకుడు సచి ప్రతిభ వల్ల సినిమా మొత్తానికి హిట్ అయ్యింది.
కాని సింగల్ లైన్ మీద నడిచే ఈ స్టొరీలో టెంపో ఉంటుంది కాని మరీ ఉత్కంట రేపే రేంజ్ లో సన్నివేశాలు ఉండవు. ఒరిజినల్ లో కేరళ నేటివిటీతో పాటు సినిమాటోగ్రఫీని బాగా వాడుకోవడం కలిసి వచ్చింది. ఇవన్ని తెలుగుకు అప్లై చేయగలమా అంటే సందేహమే. మరి మాస్ ప్రేక్షకుల అండతో మార్కెట్ సంపాదించుకున్న బాలకృష్ణ ఇలాంటి కథలో ఏ మేరకు ఇమడగలడన్న విషయంలో అనుమానం రాక మానదు. ఇందులో కమర్షియల్ అంశాలు కాని, డ్యూయెట్లు కాని ఫైట్లు కాని ఏవి ఉండవు.
ఎంతసేపు ఆ రెండు పాత్రల మధ్య సంఘర్షణ తప్ప ఇంకేది కనిపించదు. అలాంటిది బాలయ్య లాంటి హీరోని జనం ఇలాంటి స్టొరీలో ఎంతవరకు అంగీకరిస్తారన్నది వేచి చూడాలి. హక్కులైతే సితార బ్యానర్ మీద నాగవంశీ కొన్నారన్న వార్త వచ్చింది కాని ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే సినిమాను తమిళ్ లో శరత్ కుమార్, శశి కుమార్ లతో రీమేక్ చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయట. కరోనా కలకలం దెబ్బకు ఇలాంటి చాలా ప్రకటనలు వాయిదా పడిపోయాయి. మొత్తం పరిస్థితి కుదుటపడేదాకా వేచి చూడటం ఎవరైనా చేసేదేమీ లేదు.