ఉత్తరం రాశాడా? రభస చేశాడా? ఏమి ఆశించాడు?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ , రిటైర్డ్ …

ఈ వారం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిన పేరు . స్థానిక ఎన్నికల వేడితో హీటెక్కిన ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఆరు వారాలు స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసి హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి . అంతే కాకుండా వాయిదా కాలంలోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందంటూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి సంచలనానికి తెర లేపారు .

దీనిపై సీఎం ప్రెస్ మీట్ తదనంతరం కోర్టు తలుపు తట్టడం , కోర్ట్ ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమంటూనే సంప్రదింపులు లేకపోవడాన్ని తప్పు పడుతూ కోడ్ ని ఉపసంహరించమని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి . ఇంతవరకూ ఒకెత్తు అయితే తర్వాత రమేష్ కుమార్ కేంద్రానికి రాసారని చెబుతూ ఓ లేఖ కొన్ని ఛానెల్స్ లో ప్రసారం కావటం మరో సంచలనానికి దారి తీసింది .

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేస్తూ కేంద్ర హోమ్ శాఖ సెక్రటరిని అడ్రెస్ చేస్తూ ప్రచురితమైన ఆ లేఖ మీడియాకి ఎలా వచ్చిందనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా తయారైంది దీని పై భిన్న కధనాలు వినిపిస్తున్నా ప్రధానంగా మొదట ABN , తర్వాత టీవీ 5 చానల్స్ లో రాగా , తరువాత జాతీయ మీడియాలో విశ్వసనీయతకి పేరెన్నికగన్న ANI న్యూస్ లో కూడా వార్తా అంశం అయింది .

తర్వాత లేఖ రిలీజ్ చేశాడని చెప్పబడుతున్న నిమ్మగడ్డ రమేష్ వివరణ కోరిన ANI కి ఆ లేఖ తాను పంపలేదని నిమ్మగడ్డ సమాచారమిచ్చాడని అందువలన తాము ఆ వార్త వెనక్కి తీసుకొంటున్నామని మొన్న అనగా 18-Mar-2020 రాత్రి పది గంటలకు ట్వీట్ చేసింది .

అయితే ఈ నిజాన్ని మరుగు పరుస్తూ ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ అనుకూల పత్రికలుగా ముద్ర పడ్డ కొన్ని పత్రికలు ముందు రోజు తమ ఛానల్లల్లో వండి వార్చిన కథనాలకు మరింత స్వంత విశ్లేషణలు జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు జోడించి కేంద్రం రాష్ట్ర డీజీపీకి చర్యలు తీసుకోమని ఆదేశించింది అంటూ కధనాలు వచ్చాయి . ఈ వార్తలని వైసీపీ తో పాటు పలు వర్గాలు ఖండించటం , బీజేపీ నేత GVL “రామన్న రాసాడా చంద్రన్న రాసాడా” తేల్చాలంటూ అన్యాపదేశంగా చంద్రబాబు పేరు ప్రస్తావించడంతో అన్ని ఛానల్లకు కరోనా వైరస్ ని మించిన హాట్ టాపిక్ అయ్యింది .

అయితే ఈ ఘటనలన్నింటికీ మూల కారణమైన కమిషనర్ మాత్రం మౌనం పాటించడమే కాదు నిన్నటినుండీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు . ఆ లేఖ తాను రాశాడా , రాయలేదా అని స్పష్టత ఇవ్వకుండా చర్చని రచ్చగా మలచాలనుకొన్నాడా , తప్పు చేసి తిప్పుకోలేక మౌనం పాటించాడా , ఎవరి చేతిలో నైనా కీలు బొమ్మగా మారి ఈ అంశం మరింత వివాదాస్పదం అయ్యేవరకూ వేచిచూడాలని మొహం చాటేశాడా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా ఇప్పటివరకూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుండి ఏ విధమైన స్పష్టత లేదు .

ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ – భారత పరిపాలన

సహజంగా ఐఏఎస్ , ఐపీఎస్ సర్వీస్ లకు ఎంపికయ్యరు అంటే సోషల్ , ఎకనమికల్ , పొలిటికల్ , కల్చరల్ , టెక్నికల్ విభాగాల్లో అపార పరిజ్ఞానం సంపాదించి ప్రభుత్వ పరిపాలనలో భాగమైన 32 విభాగాలను సమన్వయ పరచగలిగి సాంకేతిక పాలనను చేపట్టగలిగే సమర్థత సంపాదించుకొని అవినీతి అక్రమాలకు అతీతంగా ఎన్నికయ్యి ఉంటారు .

అలాంటి అత్యున్నత సర్వీస్ కి ఎంపికై పలు విభాగాల్లో పని చేసి రిటైరైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుత నిర్ణయాలు , అయోమయ ప్రవర్తన , డోలయామాన స్థితి చూస్తుంటే ఏమైనా ప్రలోభాలకు లొంగారా లేక తన పరిధి దాటి విచక్షణా అధికారం పేరుతొ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా?అనిపిస్తుంది.

ఏ అధికారయినా శాఖాపరమైన నిర్ణయాలు తన ఆఫీసులో తీసుకొని సంబంధిత మంత్రిత్వశాఖ కు ,ప్రభుత్వమానికి తెలియచేస్తారు. పరిమితంగా ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. కానీ రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని చాలా ఆర్భాటంగా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వారి ముందు ఫైలు మీద సంతకం చెయ్యటాన్ని చూసి రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోయాయి.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగాలేదు,ముఖ్యమంత్రి మాటల దాడి చేయటంతో అదికారపార్టీ శ్రేణుల నుంచి తన మీద దాడి జరిగే అవకాశం ఉందని,కేంద్రమే తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి ఉత్తరం రాసారంటూ ప్రచారం జరిగినా దాని మీద స్పందించటానికి 34 గంటలపాటు రమేష్ కుమార్కు సమయం దొరకలేదా లేదా చర్చ జరగాలని కోరుకున్నారా?

ఏది ఏమైనా తన కేంద్రంగా జరుగుతున్నా చర్చకు ముగింపు పలకవలసింది రమేష్ కుమార్ మాత్రమే…

Show comments