iDreamPost
android-app
ios-app

పరువు నష్టం కేసులో CM రేవంత్ రెడ్డికి నోటీసులు!

Nampally Court Serve Notices To CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం నాడు నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ సీఎం రేవంత్ కి ఈ నోటీసులు జారీ చేసింది.

Nampally Court Serve Notices To CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం నాడు నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ సీఎం రేవంత్ కి ఈ నోటీసులు జారీ చేసింది.

పరువు నష్టం కేసులో CM రేవంత్ రెడ్డికి నోటీసులు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం నాంపల్లి లోని ప్రత్యేక న్యాయస్థాన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సీఎం రేవంత్ కు నోటీసులు జారీ చేసింది. గతంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అసలు ఇష్యూకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్తే..

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీ నేతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా సభలో రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైరా సభలో రేవంత్ రెడ్డి తప్పు ప్రచారం చేశారని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పిటిషన్ వేశారు. కేంద్రంలో బీజేపీ మరోసారి గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని నిరాధార ఆరోపణలు చేశారని సీఎంపై పిటిషన్ వేశారు.

రేవంత్ చేసిన కామెంట్స్ బీజేపీకి పరువు నష్టం కలిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడిన వీడియోలను సైతం పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. ఈ ఫిర్యాదను కోర్టు స్వీకరించకపోవండతో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం వీలైనంత త్వరగా సదరు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని స్థానిక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు  నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుపై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్ల రద్దు అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసింది. ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ అగ్రనేతలు మతపరమైన రిజర్వేషన్లు అవసరం లేదన్నారు. బీజేపీ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేసినా, అంతగా సఫలం కాలేకపోయారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.  కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీజేపీ నేతలు అదే సమయంలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు రద్దు, పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ లీడర్లు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.