iDreamPost
విపరీత రేట్లకు కొన్న బయ్యర్లు నిండా మునిగిపోతే రజని తన పారితోషికంలో సగం వెనక్కు ఇచ్చారనే టాక్ అప్పట్లో తమిళ మీడియాను ఊపేసింది.
విపరీత రేట్లకు కొన్న బయ్యర్లు నిండా మునిగిపోతే రజని తన పారితోషికంలో సగం వెనక్కు ఇచ్చారనే టాక్ అప్పట్లో తమిళ మీడియాను ఊపేసింది.
iDreamPost
సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ బాబా ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపరీత రేట్లకు కొన్న బయ్యర్లు నిండా మునిగిపోతే రజని తన పారితోషికంలో సగం వెనక్కు ఇచ్చారనే టాక్ అప్పట్లో తమిళ మీడియాను ఊపేసింది. తెలుగులోనూ బాబా తెచ్చిన నష్టాలకు కొదవలేదు. తాను బలంగా నమ్మిన దైవత్వాన్ని కమర్షియల్ గా చెప్పే ప్రయత్నంలో భాగంగా తలైవా స్వంతంగా రాసుకున్న కథ ఇది. నరసింహా లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కెఎస్ రవికుమార్ దర్శకుడిగా ఏఅర్ రెహమాన్ లాంటి టాప్ రేటెడ్ టెక్నీషియన్స్ ని తీసుకుని చాలా భారీ బడ్జెట్ తో నిర్మించడం మీడియాలో కథలుగా వచ్చాయి
కట్ చేస్తే ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత బాబాని రీ రిలీజ్ చేస్తున్నారు. అరుణాచలం, బాషా లాంటి సూపర్ హిట్స్ ఉండగా ఇదే దొరికిందా అనే కామెంట్స్ కి భిన్నంగా బాబా రి రిలీజ్ క్రేజ్ తమిళనాడులో ఓ రేంజ్ లో పెరుగుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఎడిట్ చేయించి కొత్త సీన్లు జోడించి రజనితో ఫ్రెష్ గా డబ్బింగ్ చెప్పిస్తున్నారు. అంతేకాదు అప్ డేటెడ్ వెర్షన్ ని ఏఆర్ రెహమాన్ కు చూపించి అవసరమైన చోట మళ్ళీ రీ రికార్డింగ్ చేయించేందుకు ప్లాన్ చేశారట. వచ్చే నెల డిసెంబర్ 12 రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున పునఃవిడుదలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తెలుగు వెర్షన్ సైతం రిలీజయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం.
మొత్తానికి ఒకప్పటి ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సినిమాలకు ఇప్పుడీ రేంజ్ లో హైప్ రావడం విశేషమే. రామ్ చరణ్ ఆరంజ్, మహేష్ 1 నేనొక్కడినే, పవన్ కళ్యాణ్ తీన్ మార్ లకు సైతం ఇలాంటి డిమాండే ఏర్పడుతోంది. మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఊగినంతగా థియేటర్లకు వస్తారా అంటే చూడాలి. ఆ మధ్య రెబెల్ కు ఇలాంటి హడావిడి చేశారు కానీ తీరా చూస్తే జనం పెద్దగా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ బాద్షాకు సైతం రెస్పాన్స్ సోసోనే. పోకిరి జల్సా లాంటి హిట్లకు మాత్రమే వసూళ్లు బాగా వచ్చాయి. ఇక్కడేమో కానీ తమిళనాడులో మాత్రం బాబాని ఓ రేంజ్ లో రికార్డులతో ఆదరించేలా ఉన్నారు. సూపర్ స్టార్ కి అక్కడున్న ఇమేజ్ అలాంటిది మరి.