iDreamPost
android-app
ios-app

35 రోజులకే సీతారామం OTT – ఎందుకంటే

  • Published Sep 06, 2022 | 11:02 AM Updated Updated Sep 06, 2022 | 11:02 AM
35 రోజులకే సీతారామం OTT – ఎందుకంటే

గత నెల విడుదలై టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన సీతారామం అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 9న అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు మలయాళం తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం నుంచే సోషల్ మీడియాలో ప్రమోషన్లు మొదలైపోయాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేటర్లకొచ్చి పట్టుమని పది రోజులు కాకుండానే ఇలా జరగడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. కనీసం ఈ నెలాఖరుదాకా అయినా ఆగాల్సిందని అడుగుతున్నారు. మొన్న వీకెండ్ లో రంగ రంగ వైభవంగా, లైగర్, ఫస్ట్ డే షో షో హాళ్లు ఖాళీగా ఉంటే కార్తికేయ 2తో పాటు సీతారామం పోటాపోటీగా హౌస్ ఫుల్ బోర్డులు వేయించుకుంది.

దీనికి వెనుక కారణాలు ఉన్నాయి. ప్రైమ్ పాలసీ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. ఒప్పందం సమయంలో నిర్మాతలతో ఎంత గడువు రాయించుకుంటుందో దానికంటే ఒక్క గంట ఆలస్యంగా రమ్మన్నా ఒప్పుకోదు. గత ఏడాది పుష్ప పార్ట్ 1 మంచి స్వింగ్ ఉన్నప్పుడు ఇరవై రోజులకు తన ప్లాట్ ఫార్మ్ లో వదిలేసింది. ప్రొడ్యూసర్లు ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడే కాదు రంగస్థలం ఇండస్ట్రీ హిట్ సాధించినప్పుడు 45 రోజులకే స్మార్ట్ స్క్రీన్ కి తేవడం అప్పట్లో ఒక సెన్సేషన్. ఆచార్య, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్లు త్వరగా రావడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ సక్సెస్ ఫుల్ మూవీస్ కి సైతం ఇదే స్ట్రాటజీ వాడటం వాళ్ళ నిబంధన.

ఇందులో ప్రైమ్ ఉద్దేశపూర్వకమైన ప్లానేమి లేదు. అది చేసేది బిజినెస్.ఈ టైంలో వదిలేస్తే మిలియన్ల వ్యూస్ వస్తాయి. సబ్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది. బాష రాని గ్లోబల్ ఆడియన్స్ సబ్ టైటిల్స్ సహాయంతో చూస్తారు. ఎక్కువ లేట్ అయితే దాని మీద ఉన్న క్రేజ్ తగ్గొచ్చు. వైజయంతి సంస్థ అగ్రిమెంట్ టైం లోనే 35 రోజుల గడువుకు ఒప్పుకుందట. ఈ రేంజ్ లో రన్ ఊహించి ఉండరు. ఎంత హిట్ అయినా నెలరోజులకు మించి ఆడలేని పరిస్థితిలో అలా నిర్ణయం తీసుకోవడం కరెక్టే కానీ తప్పదు మరి. ఇటీవలే నిర్మాతల మండలి తీసుకొచ్చిన కండీషన్ ప్రకారమైతే ఇకపై సీతారామమే కాదు ఏ సినిమా అయినా రెండు నెలల తర్వాతే ఓటిటిలో రావాలి. ప్రాక్టికల్ గా ఏ మేరకు సాధ్యమవుతుందో చూడాలి