iDreamPost
android-app
ios-app

ఈ ఛాలెంజులు ఎందుకు పాగల్

  • Published Aug 12, 2021 | 4:41 AM Updated Updated Aug 12, 2021 | 4:41 AM
ఈ ఛాలెంజులు ఎందుకు పాగల్

థియేటర్లు తెరుచుకున్న మూడో వారంలో కాస్త ఎక్కువ బజ్ ఉన్న పెద్ద నిర్మాణ సంస్థ తీసిన పాగల్ ప్రేక్షకుల ముందుకు ఈ శనివారం రాబోతోంది. శుక్రవారం సెంటిమెంట్ కి భిన్నంగా ఆ డేట్ ని ఎంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇలా నిర్వహించడంలో ఎలాంటి విశేషం లేదు కానీ హీరో విశ్వక్ సేన్ మాటలు మాత్రం చర్చకు దారి తీశాయి. లాక్ డౌన్ వల్ల మూతబడిన థియేటర్లన్నీ పాగల్ తో తెరుచుకుంటాయని అలా జరగకపోతే పేరు మార్చుకుంటానని ఏకంగా పబ్లిక్ స్టేజి మీద సవాల్ చేయడం కాన్ఫిడెన్స్ సంగతేమో కానీ ఇంత అవసరమా అనిపించిన మాట వాస్తవం.

నిజానికి ఏ హీరోకైనా దర్శకుడికైనా తమ సినిమా మీద నమ్మకం ఉండటం సహజం. ఉండాలి కూడా. అలా అని ఇంతేసి ఛాలెంజులు చేస్తేనే లేనిపోని ఇబ్బందులు. నిజానికి పాగల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అన్నింటిలోనూ వేసేంత సీన్ లేదు. వేరే సినిమాలు కూడా ఉన్నాయి. పోనీ ఇదేమైనా వందల కోట్లు టార్గెట్ చేసిన మాస్ కమర్షియల్ మూవీనా అంటే అదీ కాదు. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా పాతిక కోట్లు వస్తే అదే గొప్ప ఘనత. అది జరిగాక ఎన్ని చెప్పుకున్నా చెల్లుతుంది. నిజమే కదా మంచి సినిమా తీశారనే పేరు కూడా వస్తుంది. అలా కాకుండా ముందే ఇలా సవాళ్లు విసరడం కరెక్ట్ కాదు.

రేపు ఎల్లుండి పాగల్ తో కలిపి ఆరేడు సినిమాలు వస్తున్నాయి. యూత్ లో బజ్ ఉన్నది దీనికే. అంతమాత్రాన థియేటర్లన్నీ కిక్కిరిసిపోయేంత రేంజ్ అయితే టాక్ ని బట్టి వస్తుంది తప్ప ఓపెనింగ్స్ లోనే అద్భుతాలు జరిగిపోవు. అందులోనూ ఇది ఫ్యామిలీస్ అట్రాక్ట్ చేసే జానర్ కాదు. ట్రైలర్ అయితే అలాగే కనిపించింది మరి. దిల్ రాజు బ్యానర్ కావడంతో పాటు పోటీ పెద్దగా లేకపోవడంతో విశ్వక్ మార్కెట్ ని మించి పాగల్ కు థియేటర్లు దక్కబోతున్నాయి. ఎస్ఆర్ కళ్యాణ మండపం నెమ్మదించడంతో దీనికిది మంచి అవకాశం. హిట్ అయ్యే తీరుతుందని బల్లగుద్ది చెబుతున్న విశ్వక్ మాట ఎంతమేరకు నిజమవుతుందో ఎల్లుండి ఉదయానికి తేలిపోతుంది

Also Read : పెద్ద నిర్మాతలు ధైర్యం చేసేదెప్పుడు