పెద్ద నిర్మాతలు ధైర్యం చేసేదెప్పుడు

By iDream Post Aug. 11, 2021, 06:15 pm IST
పెద్ద నిర్మాతలు ధైర్యం చేసేదెప్పుడు

ఈ వారం రిలీజవుతున్న వాటిలో పాగల్ ఒక్కటే కాస్త చెప్పుకోదగ్గ అంచనాలతో వస్తున్న సంగతి తెలిసిందే. సునీల్ కనపడుట లేదు కొంత ఆసక్తి రేపుతోంది కానీ టాక్ ని బట్టే ఓపెనింగ్స్ తర్వాత కలెక్షన్లు వచ్చేది రానిది డిసైడ్ అవుతుంది. ఇక వచ్చే వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగేలా కనిపిస్తోంది. శ్రీ విష్ణు 'రాజరాజ చోర' 19న, సంపూర్ణేష్ బాబు 'బజారు రౌడీ' 20న వరసగా షెడ్యూల్ చేసుకుని ఆ మేరకు అధికారిక ప్రకటనలు కూడా ఇచ్చేశాయి. నిజానికి వీటికి ఓటిటి డీల్స్ వచ్చాయని అన్నారు కానీ ఫైనల్ గా థియేటర్లు తెరుచుకోవడంతో కంటెంట్ మీద నమ్మకంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

ముందు టక్ జగదీశ్ ఈ రెండు తేదీల్లో ఒక డేట్ కు రావొచ్చనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతల వైపు నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. చూస్తుంటే ఓటిటిలోనే వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పాగల్ కనక హిట్టు కొడితే వచ్చే వారం దాకా థియేటర్లలో కాస్త కళ ఉంటుంది. లేదూ ఇదీ మూడు రోజుల సంబరంగా మారితే మాత్రం ఎగ్జిబిటర్లకు వీక్ డేస్ లో చుక్కలు కనిపించడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కనీస వసూళ్లు లేక లబోదిబోమంటున్నాయి. ఉన్నంతలో ఎస్ఆర్ కల్యాణ మండపం మాత్రమే అంతో ఇంతో వసూళ్లు రాబోతోంది కానీ మరీ భారీగా అయితే కాదు.

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరీ ఆనందించేవి కావు. పెద్ద సినిమాలు ఇప్పటికీ సౌండ్ చేయడం లేదు. సేవ్ థియేటర్స్ అని నినాదాలు చేసి మీటింగులు పెట్టి వార్నింగులు సైతం ఇచ్చిన బడా నిర్మాత ఒకరు ఆయన నిర్మించిన సినిమాను ఇంకా విడుదల చేయకుండా భారీ వసూళ్ల కోసం సేఫ్ గేమ్ ఆడటం ఇప్పటికే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమాలో నిజంగా విషయం ఉంటే షోలు తగ్గినా యాభై ఆక్యుపెన్సి లాంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఆడుతుంది. దానికి క్రాక్ మంచి ఉదాహరణ. కానీ ఇలాంటి ధోరణి వల్ల ఎంతసేపూ కేవలం చిన్న సినిమాలు మాత్రమే వస్తాయంటే తమకు కష్టాలు తగ్గనట్టేనని థియేటర్ యాజమాన్యాలు వాపోతున్నాయి

Also Read : అల్లూరి భీంల గేరు మార్చాల్సిందే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp